Rajasthan : కూతురుని కొట్టారని..స్కూల్ డైరక్టర్ పై జవాన్ కాల్పులు
సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడం

Rajasthan : సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్‌పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడంతో బుల్లెట్ ఆమెకు తగిలి గాయపడింది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.
రాజస్తాన్‌లోని భరత్ పూర్ జిల్లాలోని కన్వాడా గ్రామానికి చెందిన పప్పు గుర్జార్ అనే ఆర్మీ జవాన్ కుటుంబం నివసిస్తోంది. ఆ జవాన్ కుమార్తె ఓ ప్రైవేటు స్కూల్ లో చదువుతోంది. ఆ పాప నిన్న ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. టీచర్ తనను చెంప దెబ్బకొట్టిందని తండ్రికి ఫిర్యాదు చేసింది. తన బిడ్డను కొడతారా అని ఆ ఆర్మీజవాన్‌కు పిచ్చి కోపం వచ్చింది. అటో ఇటో తేల్చుకోవాలని డిసైడయ్యారు. పాపను తీసుకుని స్కూల్‌కు వెళ్లారు.
గుర్జార్ ఆవేశం చూసి ఎందుకైనా మంచిదని ఆయన భార్య కూడా స్కూల్‌కు వెళ్లింది. కోపంతో రగిలిపోయిన జవాన్.. పాఠశాల డైరెక్టర్‌ను కలిశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అంతే.. గుర్జార్ తన జేబులో నుంచి గన్ తీసి అతనికి ఎక్కుపెట్టాడు. ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్ భార్య భుజానికే.. ఆ బులెట్ దిగింది. ఆమెను తర్వాత ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే జవాన్ అక్కడి నుంచి పారిపోయాడు. జవాన్ గుర్జార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కామా దౌలత్ సింగ్ తెలిపారు. గుర్జార్ సెలవులో ఉన్నట్లు, తన సర్వీస్ రివాల్వర్‌నే తన వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ Yogi Retorts To Akhilesh : అఖిలేష్ “రామ రాజ్యం”వ్యాఖ్యలకు యోగి కౌంటర్
- Ashok Gehlot: మత ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ: రాజస్థాన్ సీఎం
- Rajasthan Curfew : జోద్‌పూర్‌లో ఉద్రిక్తత.. రేపు రాత్రి వరకు కర్ఫ్యూ .. బయటకు వస్తే అంతే..!
- bride: పెళ్లి దుస్తుల్లో పరీక్షకు హాజరైన నవ వధువు
- Rajasthan: నా రాజీనామా లేఖ సోనియా దగ్గరే ఉంది: రాజస్థాన్ సీఎం
- Alwar temple demolish: ఆ గుళ్ళు మళ్లీ కడతాం: అళ్వార్ జిల్లా అధికారులు
1Newborn Girl Child : అంత్యక్రియలు చేస్తుండగా.. చనిపోయిందనుకున్న శిశువు కదిలింది..!
2Movie Shootings : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ??
3Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
4Priyanak jawalkar : మిర్చి కంటే ఘాటుగా ఎరుపు డ్రెస్‌లో మత్తెక్కించే చూపులతో ప్రియాంక జవాల్కర్
5Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
6Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
7Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
8Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
9Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
10Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!