Rajasthan : చనిపోయిన పేరెంట్స్‌కు వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు మేసెజ్, ఖంగుతిన్న కొడుకు

దాదాపు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఓ వ్యక్తికి ఫోన్ లో మేసెజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఎలా వ్యాక్సినేషన్ వేస్తారని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.

Rajasthan : చనిపోయిన పేరెంట్స్‌కు వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు మేసెజ్, ఖంగుతిన్న కొడుకు

Vaccinated In Rajasthan

Dead Parents Vaccinated : భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రజలకు వ్యాక్సినేషన్ వేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. అయితే..ఓ విచిత్రమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఓ వ్యక్తికి ఫోన్ లో మేసెజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఎలా వ్యాక్సినేషన్ వేస్తారని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాజస్థాన్ రాష్ట్రంలో దుంగర్ పూర్ జిల్లాలో పర్వీన్ గాంధీ నివాసం ఉంటున్నారు. 2014లో ఇతని తండ్రి చనిపోగా.. 2015లో తల్లి కూడా మరణించింది. కొన్ని రోజుల క్రితం పర్వీన్ సెల్‌కు మెసేజ్ వచ్చింది. తల్లిదండ్రులిద్దరికీ కొవిషీల్డ్ టీకా ఇవ్వడం జరిగిందని, శ్రీ గంగానగర్ జిల్లాలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో వైద్యులు వ్యాక్సిన్ వేశారని ఆ మెసేజ్ సారాంశం.

ఎప్పుడో చనిపోయిన వారికి వ్యాక్సినేషన్ ఎలా వేస్తారని అనుకున్నాడు. దీని గురించి ఆరా తీశారు. శ్రీ గంగానగర్ జిల్లాలోని 1కేడీ గ్రామంలో తన తల్లిదండ్రుల పేరిట వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుసుకున్నారు. టీకాల కోసం పత్రాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారని ఇద్దరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని పర్వీన్ వెల్లడించారు. టీకా తీసుకున్న వారు…మాస్క్ ధరించడం వల్ల..డ్యాక్యుమెంట్ లలో ఉన్న ఫొటోలను గుర్తించడం కష్టమౌతోందని, దీనిని ఆసరాగా తీసుకుని ఉండడం వల్ల..ఇది చోటు చేసుకుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

Read More : Shajapur : చెంప చెళ్లుమనిపించిన అదనపు జిల్లా కలెక్టర్