Jaisalmer : జైసల్మేర్ లో భానుడి భగ భగలు.. రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు, 74 ఏళ్లలో ఇదే మొదటిసారి
ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

Jaisalmer Highest Temperature
Jaisalmer Highest Temperature : దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. మరోవైపు రాజస్థాన్ లోని ఏడారి ప్రాంతమైన జైసల్మేర్ లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడు భగ భగ మండుతున్నాడు.
జైసల్మేర్ లో శనివారం రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. సెప్టెంబర్ లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం గత 74 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు 6.9 డిగ్రీలు అధికం. జైసల్మేర్ లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
Global Warming : యూఎస్ నుంచి యూరోప్ దాకా అధిక ఉష్ణోగ్రతలు…గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్
ఇప్పటివరకు ఇదే అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. ఎడారిలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయని పేర్కొంది. ఇక బర్మేర్ లో 40.3 డిగ్రీలు, బికనేర్ లో 40 డిగ్రీలు, జోధ్ పూర్ లో 39.5 డిగ్రీలు, జైపూర్ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రానున్న నెలల్లో కూడా రాజస్థాన్ లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వెల్లడించారు.