Global Warming : యూఎస్ నుంచి యూరోప్ దాకా అధిక ఉష్ణోగ్రతలు…గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్

గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశంలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠ వేడికి చేరుకుంది....

Global Warming : యూఎస్ నుంచి యూరోప్ దాకా అధిక ఉష్ణోగ్రతలు…గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్

Global Warming Red Alert

Global Warming Red Alert : గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. యూఎస్ నుంచి యూరోప్ దాకా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు వేడెక్కాయి. యునైటెడ్ స్టేట్స్ లో శనివారం నాడు 10 లక్షలమంది ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడారు. అమెరికా దేశంలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠ వేడికి చేరుకుంది. (Global Warming Red Alert) మండుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.

South Korea floods : దక్షిణ కొరియాలో వరదలు… 26మంది మృతి

పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అరిజోనాలో భానుడి ప్రతాపంతో ప్రజలు అట్టుడికి పోయారు. (40 Degrees Heat From US To Japan To Europe) రాష్ట్ర రాజధాని ఫీనిక్స్ లో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం ఈ ఉష్ణోగ్రత మరింత పెరిగింది. భూగోళంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతమైన కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రత 54డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

శనివారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ కు పెరిగింది. ప్రజలు ఆరుబయట కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వేసవి తాపం వల్ల కొందరు వాంతులు చేసుకున్నారు. లాస్ వెగాస్ ఎడారి వాతావరణంలో జనం బెంబేలెత్తారు.

Prevent Cough and Cold : వర్షాకాలంలో దగ్గు, జలుబును ఎలా నివారించాలి ?

దక్షిణ కాలిఫోర్నియాలో అడవిలో మంటలు రాజుకున్నాయి. 3వేల ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. కెనడాలో 10 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం దహనమైంది. ఐరోపాలో, రోమ్, బోలోగ్నా, ఫ్లోరెన్స్‌తో సహా 16 నగరాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిసిలీ, సార్డినియా ద్వీపాలు 48డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెచ్చరించింది.

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

ఐరోపాలోనూ అత్యంత వేడి నమోదైంది. గ్రీస్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఏథెన్స్ అక్రోపోలిస్ ప్రాంతంలో అత్యంత వేడి ఉష్ణోగ్రత నమోదైంది. ఫ్రాన్స్ దేశంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్పెయిన్ లోనూ ఎండలు మండుతున్నాయి. తూర్పు జపాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెచ్చుపెరిగాయి. మొరాకోలో ఈ వారాంతంలో సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు మంచినీటి కొరత తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

Yamuna River : ఢిల్లీకి ఊరట.. హర్యానాలో బ్యారేజ్ గేట్లు మూసివేత.. యమునా నదిలో తగ్గుతున్న వరద ఉధృతి

నీటి కొరత ఉన్న జోర్డాన్ ఉత్తరాన అజ్లౌన్ అడవిలో వేడిగాలుల మధ్య చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు 214 టన్నుల నీటిని పోయాల్సి వచ్చిందని సైన్యం తెలిపింది. ఇరాక్‌ దేశంలో మండే వేసవికాలంలో ప్రజలు టైగ్రిస్ నదిలో ఈత కొట్టడం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వాతావరణ మార్పులు, గ్లోబర్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు ఏటేటా పెరిగిపోతుండటం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తోంది.