Rajnath Singh: రాముడి కంటే రావణుడు చాలా తెలివైనవాడు. కానీ..

కర్ణాటక భూమిని పొగుడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‭నాథ్.. అక్క మహా దేవి, కనకదాసు, మధ్వాచార్య, కెఎం కరియప్ప వంటి ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి కర్ణాటక అందించిందని అన్నారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నందని ఆయన ప్రశంసించారు.

Rajnath Singh: రాముడి కంటే రావణుడు చాలా తెలివైనవాడు. కానీ..

Ravan was more knowledgeable than Ram, but.. says Rajnath Singh

Rajnath Singh: రాముడి కంటే రావణుడు చాలా తెలివైనవాడని, కానీ ప్రజలు మాత్రం రాముడినే ఆరాధిస్తారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం గురించి గురువారమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజ్‌నాథ్ ప్రకటించారు. “రేపు నవంబర్ 18 నేను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవ వేడుకకు హాజరు కావడానికి కర్ణాటకలోని ఉడిపికి వెళ్తున్నాను. అకాడమీ విద్యార్థులతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్, గౌరవ అతిథిగా నాసిక్‌లోని మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురీ కనిట్కర్ హాజరయ్యారు.

కర్ణాటక భూమిని పొగుడుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రాజ్‭నాథ్.. అక్క మహా దేవి, కనకదాసు, మధ్వాచార్య, కెఎం కరియప్ప వంటి ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి కర్ణాటక అందించిందని అన్నారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నందని ఆయన ప్రశంసించారు.

ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా, అనంతరం ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసిన అనుభవాలను సింగ్ గుర్తుచేసుకున్నారు. విద్యారంగం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైనదని అన్నారు. అసమర్థత, అసమానత, అన్యాయం వంటి పరిమితులకు కట్టుబడి ఉన్నవారిని విద్య విముక్తి చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. భారతీయ చరిత్రలో సైన్స్, గణితం, తత్వశాస్త్రం, ఇతర రంగాలలో గొప్ప ఆవిష్కరణలను రాజ్‭నాథ్ వివరించారు. ఇక జ్ణానం గురించి ఆయన మాట్లాడుతూ జ్ణానం ఎంతున్నా వ్యక్తిత్వం గొప్పదని, రావణుడు రాముడి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, రాముడిని ప్రజలు గుర్తుంచుకుంటారని పూజిస్తారని అన్నారు.

#RIPTwitter – Koo : ట్విట్టర్ పనైపోయింది.. మా కంపెనీలో చేరండి.. మస్క్ తొలగించిన ట్విట్టర్ ఉద్యోగులకు Koo ఆఫర్..!