Param Bir Singh : అజ్ఞాతం వీడనున్న పరంబీర్​ సింగ్​.. సుప్రీం తీర్పుతో 48 గంటల్లొ సీబీఐ ముందుకు!

ముంబై మాజీ పోలీస్​ కమిషనర్​ పరంబీర్​ సింగ్​కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబై పోలీసులు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేయగా..పరంబీర్‌ సింగ్‌

Param Bir Singh : అజ్ఞాతం వీడనున్న పరంబీర్​ సింగ్​.. సుప్రీం తీర్పుతో 48 గంటల్లొ సీబీఐ ముందుకు!

Param

Param Bir Singh ముంబై మాజీ పోలీస్​ కమిషనర్​ పరంబీర్​ సింగ్​కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబై పోలీసులు నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేయగా..పరంబీర్‌ సింగ్‌ను అరెస్టు చేయ‌వ‌ద్దు అంటూ అధికారులను ఇవాళ సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో తప్పనిసరిగా దర్యాప్తుకు హాజరుకావాలని జ‌స్టిస్ సంజ‌య్ కిష‌ణ్ కౌల్‌, ఎంఎం సుంద‌రేశ్‌ల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం పరంబీర్‌ను ఆదేశించింది. తనపై నమోదైన కేసులు సహా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మహారాష్ట్ర ప్రభుత్వం,డీజీపీ, సీబీఐ అభిప్రాయం కోరుతూ కోర్టు నోటీసులు జారీచేసింది.

కాగా, కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సింగ్‌…పరంబీర్‌ సింగ్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వాటిపై ముంబై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీచేయడంతో.. అప్పటి నుంచి పరంబీర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతవారం పరంబీర్‌ సింగ్‌ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముందు ఆయనెక్కడున్నారో చెబితేనే విచారణ కొనసాగిస్తామని తెలిపింది.

పరంబీర్‌ ఎక్కడికీ పారిపోలేదని, భారత్‌లోనే ఉన్నారని ఆయన న్యాయవాది పునీత్ బాలి సోమవారం కోర్టుకు తెలిపారు. తాను ఇండియాలోనే ఉన్నాన‌ని, 48 గంట‌ల్లో సీబీఐ ముందు హాజ‌రుకానున్న‌ట్లు ప‌రంబీర్ తన న్యాయవాది ద్వారా కోర్టుకి వెల్ల‌డించారు. అయితే తాను మహారాష్ట్రలోకి అడుగుపెడితే ముంబై పోలీసుల నుంచి ముప్పు పొంచి ఉందని.. అందుకే అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నట్లు చెప్పగా పరంబీర్‌కు అరెస్టు నుంచి ధర్మాసనం రక్షణ కల్పించింది. మాజీ ముంబై పోలీసు చీఫ్‌ను అరెస్టు చేయ‌వ‌ద్దు అని, ఆయ‌న సీబీఐ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతార‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబరు 6కు వాయిదా వేసింది.

ALSO READ Banjara Hills : బంజారాహిల్స్ లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం