బీజేపీలో చేరడానికి కారణమేంటో చెప్పిన Saina Nehwal

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 09:24 AM IST
బీజేపీలో చేరడానికి కారణమేంటో చెప్పిన Saina Nehwal

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలంపిక్ పతక విజేత Saina Nehwal బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా తన సోదరి చంద్రాన్షూతో కలిసి బుధవారం (జనవరి 29, 2020) మధ్యాహ్నం 12 గంటలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పార్టీ కండువా కప్పుకున్నారు. 

ముఖ్యమైన ప్రముఖులు ఒకరు బీజేపీలో చేరబోతున్నారంటూ బీజేపీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ముఖ్యమైనవారు ఎవరో కాదు.. సైనా నెహ్వాల్ అని తేలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైనా నెహ్వాల్ బీజేపీ పార్టీలో చేరడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీలో చేరడానికి కారణం ఏంటో సైనా నెహ్వాల్ చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో పని చేయాలని బీజేపీలో చేరానని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రధాని Modi కృషి చేస్తున్నారని సైనా నెహ్వాల్ అన్నారు. ప్రధాని మోడీ తనకు ప్రేరణ ఇచ్చారని ఆమె తెలిపారు. దేశం కోసం ప్రధాని మోడీ ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. 2019లో క్రీడా రంగానికి చెందిన గౌతమ్ గంభీర్, బబిత పొగట్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైనాతో ప్రచారం చేయించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా సైనాకున్న స్టార్‌ డమ్‌ ను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తోంది. సైనా.. హైదరాబాదీ అయినా.. హరియాణాలో పుట్టింది. బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొని ఎన్నో పతకాలు గెలిచి దేశానికి వన్నె తెచ్చింది. ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచింది. మొత్తంగా 24 అంతర్జాతీయ అవార్డులు గెలిచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీవ్ ఖేల్‌ రత్న, అర్జున అవార్డులు అందుకుంది.