RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన RedBus

ప్రముఖ ఆన్‌లైన్‌ బస్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం "రెడ్ బస్" ఇప్పుడు రైల్ టికెటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో బస్‌ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్‌..IRCTC సహకారంతో

RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన RedBus

Redrail2

RedRail ప్రముఖ ఆన్‌లైన్‌ బస్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం “రెడ్ బస్” ఇప్పుడు రైల్ టికెటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో బస్‌ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్‌..IRCTC సహకారంతో “రెడ్‌రైల్‌” పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్‌ విభాగంలోకి ప్రవేశించింది.

ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్‌ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. పరిచయ ఆఫర్‌గా, రెడ్‌రైల్ ఎలాంటి సర్వీస్ ఫీజుని విధించదు.

ప్రస్తుతం, రెడ్ బస్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులు ఇదే యాప్ నుంచి బస్ తో పాటు రైల్ టిక్కెట్ ను కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్, మాబ్‌వెబ్ మరియు iOSలో సేవలు త్వరలో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

రెడ్‌బస్ సీఈఓ ప్రకాష్ సంగం మాట్లాడుతూ…”IRCTCతో భాగస్వామ్యం అవడం రెడ్‌బస్‌కు చాలా ఆనందంగా ఉంది. చాలా అనుకూలమైన, వేగవంతమైన మరియు సురక్షితమైన ఆన్‌లైన్ రైలు టిక్ బుకింగ్ రెడ్ రైల్ ద్వారా కొనసాగుతుంది. మార్కెట్ లీడర్లుగా, మేము మా కస్టమర్‌కు ఇచ్చే విలువ బాగా తెలిసిందే. ఇంటర్‌సిటీ బస్సు ప్రయాణికులచే రెడ్ బస్ ప్రశంసించబడింది. రైల్వే ప్రయాణికులకు కూడా రెడ్ రైల్ ద్వారా అదే అనుభవాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయం నుండి, ప్రయాణికులు రైలు ఎక్కే సమయం వరకు అత్యుత్తమ బుకింగ్ అనుభవాన్ని అందించడమే రెడ్‌రైల్ లక్ష్యంగా పెట్టుకుంది. క్యాన్సిలేషన్ పైన తక్షణ రీఫండ్ తో సహా రిజర్వేషన్,ప్రయాణానికి సంబంధించి ప్రయాణీకులకు ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని తొలగించేందుకు ఐదు ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సపోర్ట్ ఉంది”అని తెలిపారు.

ALSO READ Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!