Submarine Cable System : మరో సంచలన ప్రాజెక్టుకి రిలయన్స్ జియో శ్రీకారం

టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మరో సంచలనానికి తెరలేపింది.

Submarine Cable System : మరో సంచలన ప్రాజెక్టుకి రిలయన్స్ జియో శ్రీకారం

Submarine Cable System

submarine cable system టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మరో సంచలనానికి తెరలేపింది. అధికమవుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌ వ్యవస్థను(international submarine cable system) నిర్మించేందుకు కంపెనీ శ్రీకారం చుట్టింది.

ప్రముఖ అంతర్జాతీయ భాగస్వాములు, సబ్‌మెరైన్‌ కెబుల్‌ సరఫరా సంస్థ సబ్‌కామ్‌ భాగస్వామ్యంతో సముద్రంలో భారత్‌ అంతటా విస్తరించేలా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు సోమవారం రిలయన్స్‌ జియో ప్రకటించింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్(IAX), ఇండియా యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌(IEX) పేరుతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు తెలిపింది. రెండు కేబుల్ ప్రాజెక్టులు.. IAX,IEX భారతదేశాన్ని సింగపూర్‌కు మరియు భారతదేశాన్ని మిడిల్ ఈస్ట్ మరియు మరియు యూరప్ కు కనెక్ట్ చేస్తాయి.

IAX.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశాన్ని ఆసియా పసిఫిక్ మార్కెట్లతో ముంబై, చెన్నై నుండి థాయిలాండ్, మలేషియా మరియు సింగపూర్ వరకు ఎక్స్ ప్రెస్ కనెక్టివిటీతో కలుపుతుంది. IEX…భారతదేశాన్ని పశ్చిమ దిశగా ఈజిప్ట్, జిబౌటి మరియు సౌదీ అరేబియా వంటి దేశాలతో అనుసంధానించబడిన తరువాత ఇటలీలో అడుగుపెడుతుంది. IAX 2023 ద్వితీయార్థానికి సిద్ధంగా ఉంటుందని, 2024 ప్రారంభంలో IEX సేవకు సిద్ధంగా ఉంటుందని రిలయన్స్ తెలిపింది. రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడటంతో పాటుగా, ప్రపంచవ్యాప్తంగా సేవలను విస్తరించడానికి మెగా ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు కంటెంట్ హబ్‌లకు కనెక్ట్ అవుతాయి. IAX, IEX ప్రాజెక్టులు..భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు దోహదం చేస్తాయని రిలయన్స్‌ జియో వెల్లడించింది.

ప్రాజెక్టులో భాగంగా..ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేయనున్నారు. సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం ఉంటుంది.
ఫైబర్‌ ఆప్టిక్‌ సబ్‌మెరైన్‌ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్‌ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్‌ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం’ అని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ వ్యాఖ్యానించారు.