మనీలాండరింగ్ కేసు : ఈడీ ఎదుట వాద్రా

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 09:26 AM IST
మనీలాండరింగ్ కేసు : ఈడీ ఎదుట వాద్రా

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, సోనియా అల్లుడు, వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వాద్రా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట రెండో రోజు హాజరయ్యారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం ఉదయం ఈడీ ఆఫీసుకు చేరుకున్న వాద్రాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. లండన్‌లో అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి ? ఎలా కొనుగోలు చేశారు ? దీనికి సంబంధించి ఎవరెవరని సంప్రదించారు?…ఇలా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి వాద్రా మాత్రం ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలియాల్సి ఉంది. అయితే…తనకు లండన్‌లో ఎలాంటి ఆస్తులు లేవని వాద్రా పేర్కొంటున్నట్లు టాక్. అరోరా తనవద్ద పనిచేసిన ఉద్యోగి అని తెలుసని..కానీ…తమ మధ్య ఈమెయిల్స్‌ రాయలేదని ఈడీ అధికారులతో తెలిపారు.

డీలర్ సంజయ్ భండారీతో పాటు మరో ఇద్దరి వ్యక్తులతో జరిపిన లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్లు టాక్. భండారీ, మనోజ్‌లు బినామీలని, అసలు యజమాని రాబర్ట్‌ వాద్రాయేనని ఈడీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్‌ని వాద్రాకు ఈడీ చూపించింది. జూన్ 2009, 2010 అక్టోబర్‌కు సంబంధించిన మెయిల్స్ చూపించినట్లు తెలుస్తోంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని వాద్రా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 16వ వరకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు…అయితే దర్యాప్తుకు మాత్రం సహకరించాలని కోర్టు సూచించింది. దీనితో విచారణకు ఆయన హాజరవుతున్నారు. 

ఫిబ్రవరి 06వ తేదీ బుధవారం ఆయన్ను 5 గంటలకుపైగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. లండన్‌‌లో 9 ఆస్తులకు సంబంధించిన వాటిలో వాద్రా అవకతవకలకు పాల్పడినట్లు…మొత్తం దీనివిలువ 12 మిలియన్ పౌండ్లు (రూ. 110 కోట్లు) ఉంటుందని ఈడీ పేర్కొంటూ కేసు నమోదు చేసింది. 
 

  • యుపిఏ హయాంలో జరిగిన పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు భారీగా సొమ్ములు ముట్టినట్టు ఆరోపణలున్నాయి.
  • వాద్రా, భండారీల మధ్య జరిగిన ఈ-మెయిల్స్‌పై ఈడీ ఆరా తీసింది. 
  • ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో వాద్రాకు ముడుపులు ముట్టినట్టు వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారించనుందని తెలుస్తోంది. 
  • లండన్ లో వాద్రాకి పలు కొత్త ఆస్తులున్నట్లు..రెండు ఇళ్లు (5 నుండి 4 మిలియన్లు) మరో 6 ఫ్లాట్లు, ఇంకా అనేక ఆస్తులు ఉన్నాయని ఈడీ పేర్కొంటోంది.