కూరగాయల కోసం రూ.75లక్షల బైక్‌తో..

కూరగాయల కోసం రూ.75లక్షల బైక్‌తో..

honda golden trike

Honda Goldwing Trike: మనకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి ఇండియన్లకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది. డ్రీమ్ బైక్ ను సొంతం చేసుకోవాలనే ఎవరికి ఉండదు. ఇక అలా ఆశపడి మనది అయ్యాక వదిలి ఉండలేం. ప్రతి చోటకు దానితోనే వెళ్లిపోతాం. అలాగే ఓ వ్యక్తి వెజిటెబుల్స్, ఫ్రూట్స్ కొనుగోలు చేయడానికి కూరగాయల మార్కెట్ కు రూ.75లక్షల బైక్ తో వచ్చాడు.

రోడ్ పక్కనే బైక్ ఆపి.. కూరగాయలు కొనుక్కుని అందులో సర్దుకుంటుండగా మరో వ్యక్తి వీడియో తీశాడు. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ బైక్ స్టోరేజ్ లో కిరాణా సరుకులు దాచిపెట్టాడు. ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌కు డొమెస్టిక్ హెల్ప్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ బైక్ ఓనర్ పేరు బాబు జాన్.

హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ ఓ యూనిక్ బైక్. దానిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి రూ.24లక్షల కట్టిన తర్వాత దానిని రిలీజ్ చేశారు. అసలు ఖరీదు రూ.38లక్షలు ఉన్న బైక్ కు ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకున్నందుకు రూ.24లక్షలు కట్టాల్సి వచ్చింది.

NRIఅయిన బాబు జాన్ ఆ బైక్ ను యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నాడు. దాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది.

ఈ బైక్ పవర్ ఎంతో తెలుసా.. 1832సీసీ. ఆరు సిలిండర్ ఇంజిన్. గరిష్టంగా 118బీహెచ్ పీ వెళ్లగలదు. ఇంకా ఈ మోటార్ సైకిల్ కు రివర్స్ గేర్ కూడా ఉంది. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 55లీటర్లు. ఇండియాలోని చాలా కార్ల ఫ్యూయెల్ ట్యాంకుల కంటే ఇది ఎక్కువ.