వీడియో చూడండి…RSS ప్రధాని అబద్దాలు చెబుతున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : December 26, 2019 / 09:56 AM IST
వీడియో చూడండి…RSS ప్రధాని అబద్దాలు చెబుతున్నారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ప్రధాని నరేంద్రమోడీ అబద్దాలు చెబుతున్నారంటూ అసోంలోని మతియాలో నిర్మిస్తున్న డిటెన్షన్‌ సెంటర్‌ కు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆరెస్సెస్‌ ప్రధాని భరత మాతను అవాస్తవాలతో మభ్యపెడుతున్నారని అన్నారు. 

దేశంలో అసలు నిర్బంధ కేంద్రాలే లేవని ఇటీవల మోడీ చెప్పగా,అసోంలోని మతియా నిర్బంధ కేంద్రం దాదాపు పూర్తికావచ్చిందని ఆ కేంద్రాన్ని సందర్శించిన ఓ జాతీయ టీవీ చానెల్‌ పేర్కొనడం గమనార్హం. 3000 మంది డిటెయినర్లను ఇక్కడ నిలిపిఉంచే సామర్ధ్యం కలిగిన ఈ సెంటర్‌ నిర్మాణానికి రూ 46 కోట్లు వెచ్చిస్తున్నారు. అసోం రాజధాని గువహటికి ఈ కేంద్రం 129 కిమీ దూరంలో ఉంది. 28,800 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో కూడిన 15 భవనాలను నిర్మిస్తుండగా వీటిలో 13 భవనాలను పురుషులకు, 2 భవనాలను మహిళలకు కేటాయిస్తారు.