RBI RTGS : మనీ ట్రాన్సఫర్ చేస్తున్నారా? బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ కీలక అలర్ట్

బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా

RBI RTGS : మనీ ట్రాన్సఫర్ చేస్తున్నారా? బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ కీలక అలర్ట్

Rbi Rtgs

RBI RTGS : బ్యాంకు కస్టమర్లకు ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక అలర్ట్. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారిని అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సేవలు(RTGS) ఏప్రిల్ 18న(ఆదివారం) అర్థరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు(14 గంటలు) నిలిచి పోనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవాలంది. ఆ సమయంలో మనీ ట్రాన్సఫర్ కోసం నెఫ్ట్ సేవలు వినియోగించుకోవాలని సూచించింది.

ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, పెద్ద మొత్తాలు పంపేందుకు ఆర్టీజీఎస్.. స్వల్ప మొత్తాలు పంపేందుకు నెఫ్ట్ వినియోగిస్తారు. ఆర్టీజీఎస్ లో రూ.2లక్షలకు పైబడి ఎంతైనా ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. గతేడాది(2020) డిసెంబర్ నుంచి 24గంటలూ పనిచేసేలా ఆర్టీజీఎస్ ని అప్ గ్రేడ్ చేశారు.