Ram Temple: అయోధ్యలో శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. గర్భగుడి తొలి ఫొటో వైరల్

రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. గర్భగుడి గోడలు చాలా మట్టుకు లేపారు. అయితే పై భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఈ గర్భగుడిలో కొలువు దీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప్పించారు. అవి కూడా రూపాన్ని సంతరించుకుంటున్నాయి

Ram Temple: అయోధ్యలో శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు.. గర్భగుడి తొలి ఫొటో వైరల్

See Latest Photo Of Ayodhya Ram Temple

Ram Temple: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్మిస్తోన్న రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జవనవరి చివరి నాటికి ప్రారంభిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన మేరకు పనులను జనవరి మొదటి వారంలోనే పూర్తి చేసేలా సాగుతున్నాయి. కాగా, తాజాగా రామాలయ గర్భగుడికి చెందిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను రామాలయ ట్రస్ట్ కీలక సభ్యుడు ఒకరు బయటికి విడుదల చేశారు. అయోధ్య గర్భగుడి ఇదేనంటూ ఆ ఫొటోను షేర్ చేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.


రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలం ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. గర్భగుడి గోడలు చాలా మట్టుకు లేపారు. అయితే పై భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక ఈ గర్భగుడిలో కొలువు దీరే ప్రధాన విగ్రహాలను చెక్కేందుకు నేపాల్ నుంచి పవిత్రమైన రాళ్లను తెప్పించారు. అవి కూడా రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఆలయం కింది అంతస్తు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆగస్టు నాటికి గర్భగుడి పనులు మొత్తం పూర్తికానున్నాయట. కాగా, రామమందిరానికి చెందిన ఫొటోలను, వీడియోలను నెటిజెన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షర్ చేస్తున్నారు.