Shah Rukh Khan : పారితోషికం@100కోట్లు.. హయ్యస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్‌గా షారుక్ ఖాన్ ఘనత

కింగ్ ఖాన్ గా గుర్తింపు పొందిన షారుక్ ఖాన్ మరో ఘనత సాధించాడు. హయ్యస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు షారుక్. ఓ సినిమాకు షారుక్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షారుక్ ఏకంగా..

Shah Rukh Khan : పారితోషికం@100కోట్లు.. హయ్యస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్‌గా షారుక్ ఖాన్ ఘనత

Shah Rukh Khan

Shah Rukh Khan : కింగ్ ఖాన్ గా గుర్తింపు పొందిన షారుక్ ఖాన్ మరో ఘనత సాధించాడు. హయ్యస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు షారుక్. ఓ సినిమాకు షారుక్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షారుక్ ఏకంగా రూ.100కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా కింగ్‌ ఖాన్‌ షారుక్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ‘పఠాన్‌’ లో చిత్రంలో షారుక్ ఖాన్ నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పడుకోన్, జాన్ అబ్రహం కూడా యాక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి.

లీకుల బెడద కారణంగా ‘పఠాన్‌‘ను రహస్యంగా చిత్రీకరణను జరుపుతున్నారు. అలాగే చిత్రానికి సంబంధించి టైటిల్‌ తప్ప ఇంకే సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. మరో పక్క పఠాన్‌ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి హైప్‌ ఉంది కనుకే షారుక్‌ కూడా భారీ మొత్తంలో తన రెమ్యునరేన్‌ అడిగినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 100 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బీటౌన్‌ లో టాక్‌. జీరో తర్వాత రెండేళ్లుగా వెండితెరపై షారుక్ కనపడకపోవడం, చాలా కాలం తర్వాత యాక్షన్‌ డ్రామాలో నటించడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఇంత మొత్తాన్ని అడిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

పఠాన్ చిత్రం గతేడాది(2020) నవంబర్‌లో సెట్స్‌ పైకి వెళ్లింది. 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, జాన్‌ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్‌’ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. సంగీత ద్వయంగా పేరున్న విశాల్-శేఖర్ పాటలు సమకూర్చనున్నారు. ఇందులో సీక్రెట్‌ ఏజెంట్ పాత్రలో నటిస్తున్న షారుక్‌ ముంబై రౌడీలను రఫ్ఫాడించబోతున్నాడు.

షారుక్ ఖాన్ రెమ్యునరేషన్ గురించి ప్రముఖ, మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. హయ్యస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా షారుక్ ఖాన్ ఘనత సాధించినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇది అఫిషియల్ అని చెప్పడం విశేషం. పఠాన్ సినిమా కోసం షారుక్ ఖాన్ వంద కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఉమైర్ సంధు చెప్పారు.