రైతన్న ఐడియా : పంట కోసం కుక్కను పులిగా మార్చేశాడు

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 05:33 AM IST
రైతన్న ఐడియా : పంట కోసం కుక్కను పులిగా మార్చేశాడు

ఓ రైతు తన పెంపుడు కుక్కని పెద్దపులిలా తయారు చేశాడు. తాను కష్టపడి పండించుకునే పంటల్ని కోతులు పాడు చేస్తున్నాయి. దీంతో పాపం ఓ రైతు పంటను కాపాడుకోవటానికి తన పెంపుడు కుక్కకు పెద్ద పులిలా తయారుచేశాడు. 

ఆ రైతుకు ఈ  ఐడియా ఎలా వచ్చిదంటే..
కర్ణాటకలోని శివమొగ్గ కు చెందిన శ్రీకాంత గౌడ అనే రైతుకు ఓ తోట ఉంది. తోట మంచి కాపు మీద ఉండగా కోతులు వచ్చి సర్వ నాశనం చేస్తున్నాయి. దీంతో శ్రీకాంత గౌడ పంటను కాపాడుకోవటానికి కోతుల్ని తోలేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ సాధ్యం కాలేదు. దీంతో పులి బొమ్మల్ని తోటలో పెట్టాడు. దీంతో ఆ ప్రాంతానికి రావటం మానేశాయి. మరోచోట కూడా పులి బొమ్మను పెట్టాడు. అక్కడికి కూడా కోతులు రాలేదు. దీంతో శ్రీకాంతకు కోతుల్ని భయపెట్టే ఐడియా భలే ఉందే అనుకున్నాడు. వెంటనే కొన్ని పులి బొమ్మల్ని కొని తోటలో అక్కడా పెట్టాడు. దీంతో కోతులు  తోటవైపు రావటమే మానేశాయి. 

దీంతో శ్రీకాంత గౌడకు  మరో ఐడియా వచ్చింది. తన పెంపుకు కుక్కకు జుట్టుకు వేసుకుని డై కలర్ తో పెద్ద పులి చారల్ని డిజైన్ గా వేశాడు. తన కుక్కనే పులిగా మార్చేశాడు. ఆ కుక్క తోటలో తిరుగుతుంటే కోతులు తోట వైపు తొంగి కూడా చూడటంలేదట. ఈ ఐడియాతో శ్రీకాంత గౌడ తన తోటను కాపాడుకోగలుగుతున్నాడు. కెమికల్ రంగులు వేస్తే కుక్క చర్మం పాడవుతుందని హెయిర్‌ డై వేస్తున్నాడట. 

శ్రీకాంత్ గౌడను చూసిన మరో రైతు సదానంద గౌడ కూడా తాను వేసిన మొక్కజొన్న పంటను కాపాడుకోవటానికి పులి బొమ్మల్ని కాపాలాగా పెట్టుకున్నాడు. అతని పొలంపై కూడా కోతులు దాడి చేయటం మానేశాయట. పులిలా డిజైన్ చేసిన ఈ కుక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.