Heart Attack : ఈ గుండెకి ఏమైంది? బైక్ నడుపుతూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి, వీడియో వైరల్

Heart Attack : బైక్ పై వెళ్తున్న సమయంలో సడెన్ గా గుండెపోటుకు గురయ్యాడు.

Heart Attack : ఈ గుండెకి ఏమైంది? బైక్ నడుపుతూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి, వీడియో వైరల్

Heart Attack (Photo : Google)

Heart Attack – Viral Video : గుండెపోటు.. ఇప్పుడీ పదం జనాలను బెంబేలెత్తిస్తోంది. ముచ్చెమటలు పట్టిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారే కాదు హెల్తీగా, ఫిట్ గా ఉన్న వారు సైతం గడగడ వణికిపోతున్నారు. అంతలా గుండెపోటు భయపెడుతోంది. ఎందుకంటే, సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది, అంతలోనే ప్రాణం పోతుంది. అందుకే, గుండెపోటు పేరు వినగానే అందరికీ ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా గుండెపోటు బారిన పడుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, హెల్తీగా ఫిట్ గా ఉన్న వారు సైతం హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్ నడుపుతూ గుండెపోటుతో మరణించాడు.

Also Read..Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!

బర్వానీ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. అశోక్ సోలంకి అనే వ్యక్తి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బైక్ పై వెళ్తున్నాడు. ఇంతలో సడెన్ గా గుండెపోటుకు గురయ్యాడు. అంతే, బైక్ అదుపు తప్పింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైక్ లను ఢీకొట్టాడు. అక్కడే అతడు కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అశోక్ సోలంకి బైక్ నడుపుతుండగా గుండెపోటు రావడం స్పాట్ లోనే చనిపోవడం.. ఇదంతా సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని ఎతాలోనూ ఇలాంటి షాకింగ్ ఘటనే చోటు చేసుకుంది. వివాహ వేడుకలో విషాదం జరిగింది. డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో స్పాట్ లోనే చనిపోయాడు. మ్యూజిక్ కి అనుగుణంగా కొందరు డ్యాన్స్ చేస్తున్నారు. ఓ వ్యక్తి హుషారుగా స్టెప్పులు వేశాడు. ఇంతలోనే అతడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అంతే, అలానే నేలపై కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి..

గుండెపోటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఎప్పుడు ఏ విధంగా ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో తెలియడం లేదు. వచ్చిందా.. ఇక అంతే. స్పాట్ లోనే ప్రాణాలుపోతున్నాయి.

Also Read..Eating Dinner Early : రాత్రి భోజనం త్వరగా ముగించటం వల్ల బరువు తగ్గటం, నిద్రబాగా పట్టటంతోపాటు అనేక ప్రయోజనాలు !

కాగా.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు.. వీటి కారణంగా గుండెపోట్లు పెరిగిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ రావడానికి కారణాలివే అని విశ్లేషిస్తున్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఆరోగ్యంగా ఉన్న వారు, యువకులు, చివరికి చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

బైక్ నడుపుతూ గుండెపోటు..