West Bengal Strike: సమ్మెకు హాజరైతే షోకాజ్ నోటీసు ఇస్తాం.. ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం హెచ్చరిక

తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని చెప్పింది.

West Bengal Strike: సమ్మెకు హాజరైతే షోకాజ్ నోటీసు ఇస్తాం.. ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం హెచ్చరిక

West Bengal Strike: పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి.

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని చెప్పింది. దీనికి సరైన సమాధానం ఇవ్వకుంటే ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డీఏ పెంపు విషయంలో కొంతకాలంగా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో మార్చి 10, శుక్రవారం సమ్మె చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. టీచర్లు, డాక్టర్లు, నర్సులతోపాటు వివిధ విభాగాలకు చెందిన 35 ఉద్యోగ సంఘాలు నేటి సమ్మెలో పాల్గొంటున్నాయి.

Telangana Cabinet Decisions : రాష్ట్రంలో కొత్త పథకం, ఒక్కొక్కరికి రూ.3లక్షలు, 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు-కేబినెట్ కీలక నిర్ణయాలు

దీనికోసం ప్రభుత్వానికి నోటీసు జారీ చేశాయి. అలాగే రాష్ట్రంలోని లెఫ్ట్ పార్టీలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం, కొంతకాలంగా ఉద్యోగులకు డీఏ చెల్లించకపోవడం, ప్రతిపక్షాలపై దాడులు వంటి వాటిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ‘సంగ్రామి జౌతో మంచ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ సమ్మెను విఫలం చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

శుక్రవారం రోజు ఉద్యోగులకు ఎవరికీ సెలవు లేదని ప్రకటించింది. ఎవరైనా విధులకు హాజరు కాకుండా, సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు ఇస్తామని హెచ్చరించింది. సరైన కారణాలు చూపకుంటే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించింది.