West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్‌లో విద్యార్థులకు భోజనం అందించారుఅయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది.

West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము.. అన్నం తిన్న పలువురు విద్యార్థులకు అస్వస్థత

West Bengal: మధ్యాహ్న భోజనంలో పాము బయటపడింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్, బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్కూల్‌లో విద్యార్థులకు భోజనం అందించారు.

Bengaluru: నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ కొడుకు మృతి

అయితే, అదే సమయంలో భోజనంలో పాము బయటపడింది. ఇది గుర్తించేలోపే చాలా మంది విద్యార్థులు ఆ ఆహారం తీసుకున్నారు. ఈ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది తిన్న తర్వాత వాంతులు చేసుకున్నారు. వెంటనే అధికారులు పిల్లల్ని రాం పుర్హత్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది. విద్యార్థులు ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Kantara : సర్‌ప్రైజ్.. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కాంతార.. రెండు విభాగాల్లో పోటీకి..

వండిన ఆహారంలో పాము బయటపడటానికి ముందు ఆ పాము కిచెన్‌లోని సరుకుల మధ్య కనిపించిందని కొందరు సిబ్బంది చెప్పారు. మరోవైపు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్కూల్ హెడ్ మాస్టర్‌ను అడ్డుకున్నారు. అతడి టూ వీలర్ కూడా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.