Tiger faced B747 jumbo jet : టైగ‌ర్ ఫేస్ విమానంలో భారత్‌కు రానున్న చీతాలు .. ప్రత్యేక విమానం ఫోటోలు విడుదల చేసిన ఇండియ‌న్ క‌మిష‌న్

పులి ముఖం ఉన్న విమానంలోనే నమీబియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఫోటోలను ఇండియన్ కమిషన్ విడుదల చేసింది.

Tiger faced B747 jumbo jet :  టైగ‌ర్ ఫేస్ విమానంలో భారత్‌కు రానున్న చీతాలు .. ప్రత్యేక విమానం ఫోటోలు విడుదల చేసిన ఇండియ‌న్ క‌మిష‌న్

Specially customised tiger-faced B747 jumbo jet

Tiger-faced B747 jumbo jet : భారత జాతీయ జంతువు పులి‌. బెంగాల్ టైగ్రిస్ పులి. ఆ పులి ముఖం ఉన్న విమానంలోనే నమీబియా నుంచి భారత్ కు చీతాలు రానున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఫోటోలను ఇండియన్ కమిషన్ విడుదల చేసింది. చీతాలను తీసుకురావటానికి ఇప్పటికే ఈ ప్రత్యేక విమానం న‌మీబియాకు చేరుకుంది. ఈ ప్రత్యేక విమానాన్ని ఇండియన్ కమిషన్ పులి ఫేస్ రూపంలో ఉన్న B747 జంబో జెట్ విమానం ఫోటోల‌ను రిలీజ్ చేసింది. ఉత్తర ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి మొత్తం 8 చీతాల‌ను ఇండియాకు తీసుకురానున్నారు. దీని కోసం ప్ర‌త్యేక విమానం నమీబియాకు చేరుకుంది.

African Cheetahs Coming To India : ఆఫ్రికా నుంచి ఆకలితో భారత్‌కు వస్తున్న చిరుతలు ..చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉంచుతున్న అధికారులు

ఆ విమానం ముఖ భాగాన్ని పులి ఫోటోతో డిజైన్ చేశారు. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ అంశంపై స్పందిస్తూ..గుడ్‌విల్ అంబాసిడ‌ర్ల‌కు వెల్క‌మ్ చెప్పేందుకు ఆతృత‌తో ఎదురుచూస్తున్నామ‌ని అన్నారు. కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత దేశంలో మ‌ళ్లీ ఆ పులి గాండ్రింపులు వినిపిస్తాయన్నారు. కాగా..చీతాలు అంత‌రించిన‌ట్లు 1952లోనే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న‌మీబియా నుంచి తీసుకు వ‌స్తున్న 8 చీతాల‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు. ఈ చీతాలను సెప్టెంబ‌ర్ 17వ తేదీన మోదీ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆ చీతాల‌ను పార్కులోని ఎన్ క్లోజర్ లోకి విడుదల చేయనున్నారు.

కాగా..నమీబియా నుంచి తీసుకువచ్చే ఈ చీతాలు ఆకలితో రానున్నాయి. ఎందుకంటే చీతాలు ప్రయాణం అంతా ఖాళీ కడుపుతో ఉండాలని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. విమానంలో చీతాలు ప్రయాణించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలో అవి ఖాళీ కడుపుతో వస్తేనే సురక్షితం అనీ లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నమీబియా నుంచి భారత్ కు చీతాలు మాంచి ఆకలితో రానున్నాయన్నమాట.