African Cheetahs Coming To India : ఆఫ్రికా నుంచి ఆకలితో భారత్‌కు వస్తున్న చిరుతలు ..చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉంచుతున్న అధికారులు

ఆఫ్రికా నుంచి భారత్ కు అరుదైన చీతాలు ఆకలితో వస్తున్నాయి. చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉండాల్సిందేనంటున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే

African Cheetahs Coming To India : ఆఫ్రికా నుంచి ఆకలితో భారత్‌కు వస్తున్న చిరుతలు ..చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉంచుతున్న అధికారులు

African Cheetah coming to India : విదేశాల నుంచి అరుదైన చిరుతపులులను(cheetahs) భారత్ కు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. భారత్ కు తీసుకొచ్చి పునరుత్పత్తి ప్రాజెక్టు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి 25కు పైగా చిరుతపులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పాల్పూర్ జాతీయ పార్కుకు దశల వారీగా తీసుకురానుంది. దీంట్లో భాగంగా ఉత్తర ఆఫ్రికాలోని నమీబియా దేశం నుంచి భారత్ కు చిరుతలను తీసుకురానున్నారు. ఈ చిరుతల ప్రయాణంలో అటవీశాఖ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చీతాల ప్రయాణం ప్రారంభించే సమయంలో వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వరు. చిరుతలు ఖాళీ కడుపుతోనే భారత్ కు ప్రయాణించనున్నాయి. ఈవిషయాన్ని సీనియర్ అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణం ప్రారంభం నుంచి పూర్తి అయి మధ్యప్రదేశ్ కు చేరుకునే వరకు చీతాలకు ఎటువంటి ఆహారం పెట్టకూడదని తెలిపారు.

భారతదేశంలో చిరుత పునరుద్ధరణలో భాగంగా నమీబియా నుండి వచ్చిన చిరుతలకు వాటి మొత్తం రవాణా సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వబడదని సీనియర్ అటవీ శాఖ అధికారి తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో జంతువులలో వికారం వంటివి రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు రాజస్థాన్ లోని జైపూర్ కు ప్రయాణించి మరో గంటలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని కునో పాల్పూర్ నేషనల్ పార్కుకు చేరుకుంటాయని మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జెఎస్ చౌహాన్ తెలిపారు. ఈ ప్రయాణమంతా చీతాలు ఖాళీ కడుపుతోనే ఉంటాయని తెలిపారు. ఇది తప్పనసరి అని తెలిపారు.

సెప్టెంబర్ 17న ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చిరుతలు రాజస్థాన్ రాజధానిలో కార్గో విమానంలో భారత్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తరలించి భోపాల్‌లోని కునో నేషనల్‌ పార్క్‌కు తరలిస్తారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు ఇంటర్-కాంటినెంటల్ చీతా ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. నమీబియా అధికారులతో టచ్‌లో ఉండి అన్ని అంశాలను జాగ్రత్తగా గమనిస్తు.. తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అటవీ అధికారి తెలిపారు.

చిరుతలు వచ్చిన తర్వాత ఒక నెల పాటు చిన్న ఎన్‌క్లోజర్‌లలో ఉంచబడతాయి. తరువాత పెద్దవి కొన్ని నెలల పాటు వాటికి అలవాటు పడటానికి మరియు వాటి పరిసరాలతో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయని మధ్యప్రదేశ్ అటవీ అధికారి తెలిపారు. అనంతరం వాటిని అడవిలోకి వదులుతామని తెలిపారు.

జంతువులను ఒక ఖండం నుండి మరొక ఖండానికి మార్చేటప్పుడు అవసరమైన చట్టపరమైన ఆదేశం ప్రకారం తాము ఆరు చిన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లను ఏర్పాటు చేసామని తెలిపారు.ప్రొటోకాల్ ప్రకారం, జంతువులు ఒక ఖండం నుండి మరొక ఖండానికి మారడానికి ముందు..తరువాత ప్రతి నెలా నిర్బంధించబడాలని తెలిపారు. చీతాలు చివరిగా 1947లో భారతదేశంలో మరణించిన తర్వాత 1952లో అధికారికంగా అంతరించిపోయినట్లు ప్రకటించబడింది. భారతదేశంలో ఆఫ్రికన్ చిరుత ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ 2009లో తర్వాత రూపొందించబడింది.

భారతదేశంలో ఇటువంటి అరుదైన చీతాలు అంతరించిపోయిన ఏడు దశాబ్దాల తరువాత, చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న తన పుట్టినరోజును పురస్కరించుకుని మూడు చిరుతలను నిర్బంధంలోకి విడుదల చేయనున్నారు.