Covid Tiffins : సరదాకి మొదలుపెట్టారు… కరోనా కష్టకాలంలో ఇప్పుడు కోవిడ్ టిఫిన్స్ చాలామందికి జీవనోపాధి

సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...

Covid Tiffins : సరదాకి మొదలుపెట్టారు… కరోనా కష్టకాలంలో ఇప్పుడు కోవిడ్ టిఫిన్స్ చాలామందికి జీవనోపాధి

Covid Tiffins

Covid Tiffins : సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్… ఢిల్లీలో ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఢిల్లీలో కరోనా ఉధృతి కోవిడ్ టిఫిన్స్ కు డిమాండ్ పెరిగేలా చేసింది.

కోవిడ్ టిఫిన్స్.. ఇంట్లోనే చేసే ఆహారాన్ని ఇలా పిలుస్తారు. ఇంట్లో పరిశ్రుభంగా, ఆరోగ్యకరమైన, చౌక పద్ధతిలో చేసే ఆహారాన్ని కోవిడ్ టిఫిన్స్ అంటారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడి ఇంట్లో వండుకునే అవకాశం లేని వారికి ఈ కోవిడ్ టిఫిన్స్ ఎంతో ప్రయోజనంగా ఉంటున్నాయి. వారి ఆకలి తీరుస్తున్నాయి. ఇంట్లోనే తయారు చేసే ఆహారం కావడంతో.. కోవిడ్ టిఫిన్స్ కు డిమాండ్ బాగా పెరిగింది. కరోనా కేసులు పెరిగిన కొద్దీ కోవిడ్ టిఫిన్స్ కు అమాంతం ఆదరణ పెరిగింది. ఇప్పుడీ కోవిడ్ టిఫిన్స్ ఎంతోమందికి జీవనోపాధి చూపిస్తోంది. ఇంట్లోనే ఉండి ఆహారం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు.

గత ఏడాది ఆగస్టులో హౌస్ ఆఫ్ కిచెన్స్ పేరుతో లాంచ్ చేశారు. ఆ సమయంలో 15 మంది చెఫ్స్ ఉన్నారు. ఇప్పుడు చెఫ్స్ సంఖ్య 300లకు పెరిగింది. ఏప్రిల్ 15 వరకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని వారికి 2లక్షల 75వేల టిఫిన్లు హోమ్ డెలివరీ చేసినట్లు అనుప్రియ తెలిపింది.

”ఆగస్టు 2020లో హౌస్ ఆఫ్ కిచెన్ ప్రారంభించాం. ఎంతోమంది గృహిణిలు వంటకాలు, స్పెషల్ మీల్స్ తయారు చేసి అమ్మాలని అనుకున్నారు. అదే సమయంలో నేను ఓ చెఫ్స్ నెట్ వర్క్ ఏర్పాటు చేశాను. వారి ద్వారా ఆహారం డెలివరీ చేయిస్తున్నా. ఇంట్లో వంటలు తిని తిని బోర్ గా ఫీల్ అయ్యే వారికి కొత్త రకం వంటలు డెలివరీ చేశా” అని అనుప్రియ తెలిపింది.

A Rs 100 tiffin available in Indirapuram

కరోనా సెకండ్ వేవ్ లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తమకు పరిశుభ్రమైన, ఇంట్లో తయారు చేసిన వంటకాలు కావాలని అడిగేవారు ఎక్కువయ్యారు. దాంతో కోవిడ్ రోగులకు మీల్స్ అందించడంపై మేము ఫోకస్ పెట్టాము అని అనుప్రియ తెలిపింది.

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 21 వేర్వేరు టిఫిన్ సర్వీసులు ఉన్నాయి. తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నాయి. 100 రూపాయలకే హోమ్ ఐసోలేషన్ లో ఉండే కరోనా రోగులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇంట్లో చేసిన వంటకాలు కావడంతో కోవిడ్ టిఫిన్స్ కు డిమాండ్ పెరిగింది. అమ్మ చేతి వంటలా ఉంటాయనే స్పందన వచ్చింది.

”సాధారణంగా హోటల్స్ లో తయారు చేసే ఆహారంలో ఎలాంటి నూనె వాడతారో తెలీదు. పరిశుభ్రంగా వండుతారో లేదో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ టిఫిన్స్ వల్ల చాలా ప్రయోజనం ఉంది. వారి నుంచి వచ్చే ఆహారం సురక్షితంగా భావిస్తాం. ఇంట్లో చేసుకుని తిన్నట్టే ఉంటుంది” అని ఓ కస్టమర్ చెప్పాడు.

”మేము ఇద్దరం. ఇద్దరికీ కోవిడ్ వచ్చింది. వంట చేసుకోవడం కష్టం. రెస్టారెంట్ ఆహారం కోవిడ్ టిఫిన్స్ కు ప్రత్యామ్నాయం కానే కాదు” అని మరో కస్టమర్ తన అభిప్రాయం తెలిపాడు. ఈ టిఫిన్ సర్వీసులు కరోనా రోగులకే కాదు.. హిందువుల కుటుంబాలకు ఎంతో మేలు చేశాయి. తమ ఇళ్లలో ఎవరైనా చనిపోతే 13 రోజుల వరకు ఇంట్లో వంట చెయ్యకూడదనే ఆచారాన్ని పాటిస్తారు. అలాంటి కుటుంబాలకు ఈ టిఫిన్ సర్వీసులు బాగా ఉపయోగపడుతున్నాయి.