Harsh Goenka : సెల్ ఫోన్లో గేమ్‌లు కాదు.. ఈ స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

సెల్ ఫోన్లో గేమ్స్ తప్ప.. స్ట్రీట్ గేమ్స్‌ని చాలామంది మర్చిపోయారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గొయెంకా ఓ సరదా గేమ్ వీడియోని షేర్ చేశారు. ఈ ఆట నెటిజన్ల మనసు దోచింది.

Harsh Goenka : సెల్ ఫోన్లో గేమ్‌లు కాదు.. ఈ స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

Harsh Goenka

Harsh Goenka : సెల్ ఫోన్లో గేమ్‌లు తప్ప వీధిలో ఆటలు ఆడే వాళ్లు కనిపించడం లేదు. ఒకప్పుడు చిన్నా, పెద్దా అందరూ వీధుల్లో సందడి చేసేవారు. బిజినెస్ టైకూన్ హర్ష్ గొయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ లోకల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంది.

Advice from Harsh Goenka : మీరు మంచి పని చేస్తున్నారా? దయచేసి దానిని కెమెరాలో బంధించకండి.. ఈ సలహా ఇచ్చిందెవరంటే?

ఒకప్పుడు వీధుల్లో పిల్లలు, పెద్దవాళ్లు ఆటవిడుపుగా రకరకాల ఆటలు ఆడుతూ కనిపించేవారు. ఇప్పుడు సెల్ ఫోన్లో తల పెట్టినవారు పక్కకి తిరిగి చూడటం లేదు. సరదాగా సమయం గడపాలంటే పెద్దగా స్థలం కూడా అక్కర్లేని ఓ గేమ్ వీడియోని హర్ష్ గొయెంకా షేర్ చేశారు. @hvgoenka అనే తన ట్విట్టర్ ఖాతాలో ‘గోల్ఫ్ , క్రికెట్ , బౌలింగ్ ఇలా ఏదైతేనేం సరదా సరదా!’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.

వీడియో ఓ విలేజ్‌లో షూట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉన్న గాజు సీసాలను రెండువైపుల నిలబెట్టారు. ఆ సీసాలకు దూరంగా స్టీలు పాత్రలను టవర్ లాగ ఒకదానిపై ఒకటి అమర్చారు. జనం ఒకరి తరువాత ఒకరు వరుసగా వచ్చి బ్యాట్‌తో ఫుడ్ బాల్‌ను కొట్టాలి. రెండువైపులా ఉన్న సీసాలకు ఆ బాల్ తగలకుండా స్టీలు పాత్రలు అమర్చిన టవర్‌ను కూల్చాలి. చాలా సరదాగా సాగిన ఈ ఆటలో గెలిచిన వారు బహుమతులు అందుకున్నారు.

MRI scanner : పిల్లల కోసం సరికొత్త MRI స్కానర్ .. నిజంగా వారి భయాన్ని పోగొడుతుందా?

‘వాళ్లంతా సంతోషంగా ఆడుతున్నారు.. ఇలాంటి ఆనందాలు ఇప్పటి రోజుల్లో కనుమరుగైపోయాయని’ కొందరు.. ‘కొత్తరకం గేమ్.. భలే ఉంది’.. అంటూ వరుసగా కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఆటలు ఒత్తిడిని దూరం చేయడమే కాదు.. ఇరుగుపొరుగువారి మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.