Sudha Murthy: మైసూరు రాజ మహిళ పాదాలకు నమస్కరించిన సుధా మూర్తి.. నెటిజన్ల విమర్శలు

మైసూరు రాజవంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కారం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పనిని విమర్శిస్తున్నారు.

Sudha Murthy: మైసూరు రాజ మహిళ పాదాలకు నమస్కరించిన సుధా మూర్తి.. నెటిజన్ల విమర్శలు

Sudha Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఇటీవల చేసిన ఒక పనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా సుధామూర్తి.. మైసూరు రాజ వంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కరించారు.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

ఈ ఫొటో మీడియాలో రావడంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాజ్యాలు, రాజుల కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ ఇంకా రాజవంశానికి చెందిన వారికి ఇలా నమస్కరించడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సుధా మూర్తి లాంటి ఉన్నతస్థాయి వ్యక్తులు రాజ వంశీకుల్ని అంతలా గౌరవించాలా.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సుధా మూర్తి చేసిన పని బానిసత్వానికి ప్రతీక అని ఒకరంటే, ఇప్పటికీ అంత గౌరవం పొందే అర్హత వారికుందా అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. అయితే, కొందరు సుధామూర్తి చేసిన పనిని సమర్ధిస్తున్నారు.

అది మన సంస్కృతి అని, వయసు, స్థాయి, స్థానంతో సంబంధం లేకుండా రాజమాతను గౌరవించాలని ఒక నెటిజన్ అన్నారు. సుధామూర్తి చేసిన పని ఆదర్శప్రాయమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి సుధామూర్తి అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు తావిచ్చింది.