డిగ్రీ అడ్మిషన్​ లిస్ట్​లో టాపర్​గా సన్నీలియోన్

10TV Telugu News

కోల్ కతా లోని ఓ డిగ్రీ కాలేజీ  అడ్మిషన్​ లిస్ట్​లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ టాపర్​గా నిలిచింది. నలభై ఏళ్ల వయసులో సన్నీ ఇంటర్ లో 400/400 మార్కులు సాధించి. డిగ్రీ కాలేజీ అడ్మిషన్​ లిస్ట్​లో  టాపర్ గా నిలిచింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సన్నీలియోన్ సినిమాలు మానేసి కాలేజీకి వెళ్లి చదువుకోవాలని డిసైడ్ అయ్యిందా అని షాక్ అయ్యారా?
https://10tv.in/kangana-ranaut-makes-explosive-revelation-on-rampant-use-of-drug-in-bollywood/
ప్రస్తుతం దేశంలో కరోనా తెచ్చిన కష్టంతో ఆన్​లైన్​లోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంటర్ పాసైనవారు డిగ్రీ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నారు. అలా వచ్చిన అప్లికేషన్లను కోల్​కతాలోని అశుతోష్ డిగ్రీ కాలేజీ ఇంటర్ ప్రతిభ ఆధారంగా ఒక వరుస క్రమంలో పెట్టింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం తొలి జాబితాను తమ వెబ్​సైట్​లో విడుదల చేసింది.అయితే… ఆ లిస్ట్ మొదటి వరుసలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు చూసి విద్యార్థులతో పాటు, కళాశాల యాజమాన్యం ఖంగుతింది. సన్నీ లియోనీ పేరిట ఎవరో తప్పుడు దరఖాస్తు పంపించారని, .ఇదెవరో కావాలని చేసిన పనేనాని అశుతోష్ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఆ పేరు జాబితా నుంచి తొలగించాల్సిందిగా ప్రవేశాల విభాగానికి సూచించినట్లు తెలిపింది. సన్నీ పేరిట బీఏ(ఆంగ్లం)లో సీటు కోసం దరఖాస్తు చేసిందెవరనే కోణంలో విచారణ చేపట్టింది.