Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

క‌రోనావైర‌స్‌ మహమ్మారి నివారణకు ఎర్ర‌చీమ‌ల పచ్చడిని ఉప‌యోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్ర‌మైన‌ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన‌ అత్యున్న‌త న్యాయ‌స్థానం

Red Ant Chutney : కరోనాకు నివారణగా ఎర్రచీమల చట్నీ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Red Ant Chutney

Red Ant Chutney : క‌రోనావైర‌స్‌ మహమ్మారి నివారణకు ఎర్ర‌చీమ‌ల పచ్చడిని ఉప‌యోగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ విచిత్ర‌మైన‌ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన‌ అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కరోనాకు విరుగుడుగా సంప్రదాయ వైద్యమైన ఎర్ర చీమల పచ్చడిని ఉపయోగించాలని సిఫార్సు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ఎంతోమంది ఏదైనా వ్యాధిబారిన ప‌డిన‌ప్పుడు త‌మ‌కు తెలిసిన చిట్కాల‌ను ఉప‌యోగిస్తుంటార‌ని, వారికి అవి ప‌నిచేసినంత మాత్రాన దేశ‌మంతా దాన్నే పాటించాల‌ని చెప్ప‌లేమ‌ని తేల్చి చెప్పింది.

క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు పిటిష‌న‌ర్ ఎర్ర‌చీమ‌ల చ‌ట్నీని తినాల‌నుకుంటే తిన‌వ‌చ్చ‌ని, దాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని కోర్టు తెలిపింది. అంతేకానీ దేశ ప్ర‌జ‌ల‌ని కూడా అదే తినాల‌ని తాము ఆదేశించ‌లేమ‌ని తేల్చిచెప్పింది. సంప్రాదాయ‌క చిట్కాలను అనుస‌రిస్తే.. దాని ప‌ర్య‌వ‌స‌నాల‌ను పాటించిన‌ వారే అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని చెప్పింది.

Ira Basu : ఫుట్‌పాత్ పైనే జీవనం.. దయనీయ స్థితిలో మాజీ సీఎం మరదలు

ఎర్రచీమలు, మిరపకాయలతో చేసిన పచ్చడిని జలుబు, దగ్గు, నీరసం, శ్వాస సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని, కరోనా నివారణకు దీన్ని సిఫార్సు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఒడిశాకు చెందిన గిరిజనుడు నయాధర్‌ పఢియాల్‌ దావా వేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు దీన్ని సంప్రదాయ వైద్యంగా భావిస్తారని తెలిపారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘చాలా రకాల సంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. మన ఇంట్లోనూ కొన్నింటిని ఉపయోగిస్తుంటారు. దేశమంతటా దీన్ని అమలు చేయాలని అడగకూడదు’’ అని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం చెప్పింది.

Chicken Blood Parenting : చైనాలో మొదలైన కొత్త ట్రెండ్.. అది నాశనానికే అంటున్న నిపుణులు..!

ఒడిశాకు చెందిన ఇంజినీర్, రీసెర్చర్ నయాధర్ పాధియల్ ఈ పిటిషన్ వేశారు. నయాధర్ పాధియల్ తొలుత ఒరిస్సా హైకోర్టులో ఇదే విషయమై దావా వేయగా దీనిపై పరిశీలన జరపాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), ఆయుష్‌ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దావాను కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిష‌న్‌ను ఇక్క‌డితో ముగిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వ్య‌క్తికి వ్యాక్సిన్ వేయించాల‌ని, ఎర్ర‌చీమ‌ల చ‌ట్నీ పేరుతో వ్యాక్సిన్ వేసుకోకుండా ఉంటాడేమోన‌ని తెలిపింది. ఒడిశా, చ‌త్తీస్‌ఘ‌డ్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎర్ర‌చీమ‌ల చ‌ట్నీని ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి జ‌బ్బుల‌ను న‌యం చేసే చిట్కాగా పాటిస్తుంటారు.