Chicken Blood Parenting : చైనాలో మొదలైన కొత్త ట్రెండ్.. అది నాశనానికే అంటున్న నిపుణులు..!

చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే ఇది అనేక అనర్దాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Chicken Blood Parenting : చైనాలో మొదలైన కొత్త ట్రెండ్.. అది నాశనానికే అంటున్న నిపుణులు..!

Chicken Blood Parenting

Chicken Blood Parenting : ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టపడాలి. ఆషామాషీగా వ్యవహరిస్తే ఉద్యోగం, వ్యాపారం రెండు దెబ్బతింటాయి. ఈ ఉద్దేశంతోనే చాలామంది కష్టపడి పనిచేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు చైనా ఇదే ధోరణి అవలంబిస్తోంది. తమ పిల్లలు ప్రపంచంతో పోటీ పడి జగజ్జేతలుగా నిలవాలని ఆశపడుతోంది. చదువు, ఆటలు, కళలు.. అన్ని రంగాల్లో తమ పిల్లలు ఆరితేరాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే అక్కడి తల్లిదండ్రులు పిల్లలకు రోజుకు 14 గంటలు శిక్షణ ఇస్తున్నారు. పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. వారి చదువుకోసం స్కూల్ దగ్గర్లోనే ఇల్లు కొంటున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు సెలవు పెట్టిమరీ తమ పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. “చికెన్ బ్లడ్ పేరెంటింగ్” పేరుతొ కొత్త పద్దతిని తీసుకొచ్చి పిల్లలకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

చికెన్ బ్లడ్ పేరెంటింగ్ అంటే ఏంటి? ఆలా ఎందుకు పిలుస్తున్నారు.

పూర్వకాలంలో రోగంతో బాధపడుతున్న వ్యక్తికి అప్పుడే చంపిన కోడి రక్తం తాగించేవారు. ఆలా చేస్తే వారు వ్యాధి నుంచి కోలుకుంటారని చైనీయులు నమ్మేవారు. బట్టతల కూడా పోతుందని విశ్వసించేవారు. అప్పుడే చంపిన కోడి రక్తం తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని నమ్మేవారు. కోడి రక్తంతో కూడుకున్న చికిత్స కావడంతో దీనికి ‘చికెన్‌ బ్లడ్ ట్రీట్మెంట్” అనేవారు. తమ పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలని అక్కడి పేరెంట్స్ ప్రస్తుతం ఇదే విధానం అనుసరిస్తున్నారు. అందుకే దీనికి “చికెన్ బ్లడ్ పేరెంటింగ్” అని పేరు పెట్టారు.

అయితే చైనా తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై నిపుణులు, వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను నిర్బంధిస్తూ, పుస్తకాలతో కుస్తీ పట్టించడం వల్ల అనేక అనర్దాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. చిన్నపిల్లలు కంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. 81 శాతం మంది పిల్లలకు కంటి చూపు తగ్గిందని చైనాలోని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర విషయమని హెచ్చరించింది. టీనేజర్లలో 25 శాతం మంది డిప్రెషన్‌లోకి, 7.4 శాతం మంది కోలుకోలేని నిరాశలోకి వెళ్లినట్టు వైద్యులు తెలిపారు.