Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన కోర్టు

రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన కోర్టు

Demonetisation: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మోదీ ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Telangana: పోలీస్ రిక్రూట్‌మెంట్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలు

రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. జస్టిస్ గవాయ్ ధర్మాసం వెల్లడించిన తీర్పు ప్రకారం.. ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటు అవుతుంది. ఈ నిర్ణయాన్ని రద్దు చేయడం కుదరదు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఆర్బీఐ అభిప్రాయం తీసుకుని, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని, నోట్ల రద్దు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. నోట్ల రద్దుపై దాఖలైన 58 పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం

నాటి ఆర్బీఐ నోటిఫికేషన్‌ను రద్దు చేయలేమని పేర్కొంది. అయితే, ఈ తీర్పు విషయంలో సుప్రీం ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయాన్ని జస్టిస్ బీవీ.నాగరత్న వ్యతిరేకించారు. నోట్ల రద్దును గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టం ద్వారా చేసి ఉండాల్సిందని నాగరత్న అభిప్రాయపడ్డారు. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ.రామసుబ్రమణియన్ ఉన్నారు. 2016లో నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.