విజయ్ మాల్యాకు మరో దెబ్బ..సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేత

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 01:28 PM IST
విజయ్ మాల్యాకు మరో దెబ్బ..సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేత

vijay-malya

బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా..ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రయత్నాలుల బెడిసికొడుతున్నా..వెనుకడుగు వేయడం లేదు మాల్యా. తాజాగా. కోర్టు ధిక్కరణ రివ్యూ పిటిషన్ ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసింది.



కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని మాల్యా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టు ఉత్వర్వులను ఉల్లంఘిస్తూ.. డియాగియో కంపెనీ నుంచి తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేశాడు.

బ్యాంకులకు మాత్రం డబ్బుల కట్టకుండా..పిల్లలకు భారీ మొత్తంలో డబ్బులు బదిలీ చేయడంపై SBI బ్యాంకు సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే..ఆ బ్యాంకుకు మాల్యా రూ. 9 వేల కోట్లు బకాయిపడ్డారు.



ఇదే కేసులో మాల్యాను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. 2017, మే 09వ తేదీన తీర్పునిచ్చింది. కాన ఈ కేసులో ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ విజయ్‌ మాల్యా పిటిషన్‌ వేయగా.. తాజాగా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మరి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో చూడాలి.