Massive Fraud : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా.. ఆ డబ్బుతో నాలుగు పెళ్లిళ్లు

కేంద్రప్రభుత్వ ఉద్యోగినంటు పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

Massive Fraud : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా.. ఆ డబ్బుతో నాలుగు పెళ్లిళ్లు

Massive Fraud

Massive Fraud :  కేంద్రప్రభుత్వ ఉద్యోగినంటు పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడుపి జిల్లా కుందపురకు చెందిన రాఘవేంద్ర తక్కువకాలంలోనే ధనవంతున్ని కలవని అనుకున్నాడు. డబ్బు సంపాదించాలని 10ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చాడు. కేంద్ర సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్ అని నకిలీ గుర్తింపు కార్డు చేయించుకున్నాడు.

చదవండి : Massive Fraud : అధిక వడ్డీల పేరుతో రూ.200 కోట్లు మోసం..బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు

కారుకు భారత ప్రభుత్వం అని బోర్డు తగిలించాడు. ఐడి కార్డు చూపించి తన అక్రమ దందా మొదలు పెట్టాడు. కేంద్ర సర్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి.. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగుల వద్ద రూ.20 లక్షలు వసూలు చేశాడు. ఆ డబ్బులతో ప్లాట్లు, కార్లు, పొలాలు కొనుగోలు చేశాడు. డబ్బు విచ్చలవిడిగా వస్తుండటంతో బెంగళూరు జే.పీ.నగరలో ఉంటున్న రాఘవేంద్ర హావేరి, బాగలకోట, బెంగళూరు, కుందాపురలో రహస్యంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు.

చదవండి : Fraud Alert : ఆన్‌‌లైన్ యాప్ మోసం..రూ. 36 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ వాసి

డబ్బు ఇచ్చి ఏడాది అవుతున్నా ఉద్యోగం కొందరు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఉద్యోగాల పేర మోసం చేసిన రాఘవేంద్రను అదుపులోకి తీసుకోని విచారించారు. విచారణలో భార్యల వ్యవహారం.. ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఇక కేటుగాడు నుంచి నకిలీ గుర్తింపు కార్డు, మొబైల్‌ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, చెక్‌బుక్, బాండ్‌ పేపర్లు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన ఫిర్యాదులపైనా విచారణ చేపట్టారు.