Anita Radhakrishnan : బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి..చేతులపై మోసుకెళ్లిన మత్స్యకారులు

మత్స్యకారుల కష్టాలు తెలుసుకోవటానికి వచ్చిన మత్స్యశాఖా మంత్రి బోటు దిగటానికి వెనుకాడారు.ఎందుకంటే బోటు దిగితే తన బూట్లు నీటితో తడిచిపోతాయట. దీంతో మత్స్యకారులు మంత్రిగారిని చేతులు మీద మోసుకెళ్లిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Anita Radhakrishnan : బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి..చేతులపై మోసుకెళ్లిన మత్స్యకారులు

Tamil Nadu Department Of Fisheries Minister (2)

Anita Radhakrishnan అధికారం రాగానే కొంతమంది నేతలకు తలకు పొగరు ఎక్కుతుందేమో. జనాలు ఓట్లు వేయించుకుని అధికారులోకి వచ్చి..ఆ ప్రజల ముందు ఫోజులు కొడతారు. అదే చేశారు తమిళనాడులో ఓమంత్రి. నా కాళ్లకు వేసుకున్న బూట్లు తడిచిపోతాయి నీళ్లలో దిగితే అంటూ బోటు దిగకుండా అలాగే చూస్తు కూర్చున్నారు. దీంతో స్థానికులు ఆ మంత్రిగారిని చేతులమీద ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా అంటున్నారు నెటిజన్లు.

తమిళనాడులోని పాలవర్కడులో అధికార పారటీ డీఎంకే చెందిన మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు.

అనంతరం బోటు తీరానికి చేరగానూ మంత్రిగారు బోటు దిగటానికి సంచయిస్తున్నారు. కారణం ఆయన వేసుకున్న బూట్లు తడిచిపోతాయట. దీంతో బోటు దిగటానికి మత్స్యకారులు ఒక కూర్చి కూడా వేశారు. పడవ ఒడ్డుకు కాస్త దూరంలో నిలిచింది. దీంతో తన కాలి బూట్లు నీటిలో తడిచిపోతాయని మంత్రిగా బోటు దిగటానికి వెనుకాడారు అనితా రాధాకృష్ణన్‌.మంత్రిగారి ఆలోచనలను పసిగట్టిన మత్స్యకారులు ఒకరినొకరు చూసుకున్నారు. అంతా కలిసికట్టుగా మంత్రిగారిని తమ చేతులపై మోసి ఒడ్డుకు చేర్చి దింపారు. మంత్రి వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. ఎంత మంత్రి అయితే మాత్రం ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు బురద అయినా పట్టించుకోరు..ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బూట్లు తడిచిపోతాయని జనాలతో మోయించుకుంటారా? అంటూ విమర్శలు సంధిస్తున్నారు.