Corona Delta Variant : వ్యాక్సిన్ తీసుకున్నవారి ద్వారా కూడా డెల్టా వేరియంట్ వ్యాప్తి

డెల్టా వేరియంట్ కు సంబంధించి పరిశోధకులు కొత్త విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి ద్వారా కూడా డేల్టా వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వెల్లడించారు.

Corona Delta Variant : వ్యాక్సిన్ తీసుకున్నవారి ద్వారా కూడా డెల్టా వేరియంట్ వ్యాప్తి

Delta Variant

delta variant transmitted : ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ డెల్టా ప్లస్‌ కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్నాయి. డెల్టా వేరియంట్ కు సంబంధించి పరిశోధకులు కొత్త విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా ఇంటి వాతావరణంలో డేల్టా వేరియంట్ బారినపడే అవకాశం ఉందని, వారి ద్వారా ఈ వేరియంట్ ఇతరులకూ వ్యాపించవచ్చని తెలిపారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోలిస్తే ఇలాంటి వారి ద్వారా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.

బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్ ఇన్ ఫెక్షన్ డిసీజెస్ లో ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ పొందినవారిలో ఇన్ ఫెక్షన్ త్వరగా నయమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే గరిష్ట వైరల్ లోడు మాత్రం ఇతరులతో సమానంగానే ఉంటుందన్నారు. వారి ద్వారా ఇళ్లల్లో వైరస్ వ్యాప్తి జరగడానికి ప్రధాన కారణమని చెప్పారు.

Coronavirus Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..
కరోనా వ్యాప్తి చాలా వరకూ ఇళ్లల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ పొందినవారి ద్వారా గృహాల్లో డేల్టా వేరియంట్ వ్యాప్తిపై వివరాలు అందుబాటులో లేవని తెలిపారు. కరోనాను అదుపు చేయడానికి వ్యాక్సిన్ కీలకం అన్నారు. కరోనా సోకినవారిని తీవ్ర అనారోగ్యం, మరణం బారి నుంచి కాపాడటంలో అవి సమర్థత చాటుతున్నాయి. అయితే ఇళ్లల్లో డేల్టా రకం వ్యాప్తిని అడ్డుకోవడంలో వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని తమ అధ్యయనం చెబుతుందని ప్రొఫెసర్ అజిత్ లాల్ వానీ వెల్లడించారు.

మరోవైపు కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు తగ్గినట్లు తగ్గి మరో రోజు పెరుగుతున్నాయి. మరోవైపు, బ్రిటన్, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు ఇండియాలోనూ నమోదవుతున్నాయి. ఏవై.4.2 రకం వైరస్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలలకు కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.