Coronavirus Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..

భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరి

Coronavirus Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..

Coronavirus Variant

Coronavirus Variant : భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేగింది.

అవును, కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డెల్టా వేరియంట్‌ రాజ్యమేలగా.. తాజాగా మధ్యప్రదేశ్​లో కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. ఇండోర్‌లో ఆరుగురు వ్యక్తులకు కొత్తగా ఏవై.4 వేరియంట్ సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. బాధితులంతా కరోనా​ టీకా పూర్తి డోసులు తీసుకున్నప్పటికీ.. వైరస్​ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

Mohammed Shami : పాకిస్తాన్ వెళ్లిపో, దేశద్రోహి, ఎంత డబ్బు తీసుకున్నావ్… భారత క్రికెటర్‌పై పచ్చి బూతులు

దీనిపై ఇండోర్‌ ముఖ్య వైద్యాధికారి బీఎస్ సైత్య స్పందించారు. ” ఢిల్లీలోని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (NCDC) నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. ఆరుగురు వ్యక్తులకు ఏవై.4 రకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరి నమూనాలను జన్యు పరీక్షల కోసం సెప్టెంబరులో ఢిల్లీకి పంపగా తాజాగా ఫలితాలు వెలువడ్డాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దేశంలో ఏవై.4 రకం కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. బాధితులంతా కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్న వారే. చికిత్స తర్వాత వారంతా కోలుకున్నారు’ అని తెలిపారు.

ఈ ఆరుగురు వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న మరో 50 మందికి కూడా పరీక్షలు నిర్వహించగా వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిందని వైద్యాధికారి వెల్లడించారు. ఏవై.4 ఓ కొత్త రకం వేరియంట్​ అని.. దీనికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదని ఇండోర్​లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన అధికారి డాక్టర్ అనితా చెప్పారు.

Hair Dye : జుట్టుకు హెయిర్ డై వాడుతున్నారా!..తప్పక తెలుసుకోవాల్సిందే…

ఇండోర్ జిల్లాలో ఇప్పటివరకు ఒక లక్షా 53వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 1,391 మంది కరోనాకు బలయ్యారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మధ్యప్రదేశ్ లో తీవ్రంగా ప్రభావితమైన జిల్లా ఏదైనా ఉందంటే అది ఇండోర్. ఇక, ఇప్పుడిప్పుడే దేశం డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటోంది. ఇటువంటి తరుణంలో మరో కొత్త రకం వేరియంట్ రావటం ఆందోళనకు గురి చేస్తోంది. మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని జనాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.