Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఇక నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని .. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని చెప్పింది.

Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

Monsoon 11zon

Southwest Monsoon  సూర్యుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కూడా ముందుగానే నైరుతి రుతుపవనాలు విచ్చేస్తున్నాయని చల్లటి కబురు వినిపించింది. అండమాన్, నికోబార్ దీవుల్లో మే 15లోపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి.. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ తెలిపింది.

ఇక నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని .. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని చెప్పింది. సాధారణంగా నైరుతి పవనాలు జూన్‌ 1న కేరళలో ప్రవేశిస్తాయి. క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తాయి. అయితే, ఈసారి ఈ నెల 27నే కేరళను తాకనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Temperatures : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏప్రిల్‌లో 122 ఏళ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు

అసని తుఫాను కారణంగానే నైరుతి ముందుగా వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేలోనే నైరుతి రుతు ప‌వ‌నాలు భార‌త్‌ను తాక‌డం ఐదేళ్లలో తొలిసారి అంటున్నారు. అయితే… భార‌త తీరాన్ని నైరుతి రుతుప‌వ‌నాలు తాకినా.. దేశ‌వ్యాప్తంగా విస్తరిస్తాయా? లేవా? అన్న సందేహాలు ఉన్నాయి.