నీలీనీలీ ఆకాశం కంటే అందమైన పాము ..గులాబీపై గువ్వలా ఎలా ఒదిగిపోయిందో చూడండీ

  • Published By: nagamani ,Published On : September 19, 2020 / 11:46 AM IST
నీలీనీలీ ఆకాశం కంటే అందమైన పాము ..గులాబీపై గువ్వలా ఎలా ఒదిగిపోయిందో చూడండీ

నీలీ నీలీ ఆకాశం కంటే అందమైన ఈ పామును చూస్తే కళ్లు తిప్పుకోలేం..అందమైన గులాబీపై గువ్వలా ఒదిగిన పాలపిట్ట రంగులో కళ్లు మిరిమిట్లు కొలిపే బము సుందరమైన ఈ సరీసృపాన్ని చూస్తే ఔరా..ఏమి అందం అనిపించకమానదు. పాముల్లో ఎన్నో రకాల జాతులున్నట్లే..మరెన్నో రంగుల పాములు ఉంటాయి. ఆకుపచ్చ, గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో పాములను చూశాం.


కానీ నీలినీలి ఆకాశం, పాలపిట్ట రంగుల్ని పులుముకున్నట్టు ఉంటుంది ఈ అరుదైన అద్భుతమైన పాము. గులాబీ పువ్వుపై గువ్వలా ఒదిగిపోయింది. నీలి రంగులో మెరిసిపోతున్న ఈ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రంగు పామును ఇంతవరకు చూసినవారు అరుదు అనే చెప్పాలి.


ఇటువంటి రంగులో ఉన్న పాముల సంఖ్య కూడా చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. లేత నీలి రంగులో ఉండే ఈ పాము పేరు బ్లూ పిట్‌ వైర్‌. పిట్‌ వైపర్‌ జాతి పాములు సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగులో చాలా అరుదుగా ఉంటాయి. ఇవి ఇండోనేషియా, తూర్పు తైమూర్లలో కనిపించే విషపూరిత పిట్ వైపర్ ఉప జాతులు.


‘లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌’ అనే ట్విటర్‌ అకౌంట్ నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూవ్స్‌ వచ్చాయి. అందంగా కనిపిస్తున్న ఈ పామును చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. గ్రాఫిక్ పాములా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పైకి కనిపించేంత సాఫ్ట్‌ పాము కాదట. ఇది అత్యంత విషపూరితమైనది అంటున్నారు. ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.