Federalism: ఫెడరలిజం (సమాఖ్యవాదం) తిరిగొచ్చింది..

అసెంబ్లీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి మధ్య ఉన్న బయటపెట్టాయి. అది అటుంచితే కొత్త ప్రభుత్వాలన్నీ ...

Federalism: ఫెడరలిజం (సమాఖ్యవాదం) తిరిగొచ్చింది..

Federal

Federalism: అసెంబ్లీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి మధ్య ఉన్న బయటపెట్టాయి. అది అటుంచితే కొత్త ప్రభుత్వాలన్నీ కొవిడ్ 19 మీద ఫోకస్ పెట్టి పనిచేయాల్సిన టైం ఇది. కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే క్యాబినెట్ బెర్త్ ల గురించి కొట్టుకోకుండా సెకండే వేవ్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కష్టపడితే మంచిది.

తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) వెస్ట్ బెంగాల్ లో మూడోసారి గెలవడం, ద్రవిడ్ మున్నేట్ర కఝగం(డీఎంకే) తమిళనాడులో దశాబ్ద కాలం తర్వాత మళ్లీ అధికారంలోకి రావడం, కేరళ నుంచి నాలుగు దశాబ్దాల తర్వాత లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ పవర్ చేజిక్కించుకోవడం, అస్సాంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ గెలవడం, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పుదుచ్చేరిలో తొలిసారి జెండా ఎగరేయడం వంటివన్నీ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రభావం ఎలా ఉందో కనబరుస్తున్నాయి. కానీ, ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ఐదు రకాలుగా ప్రభావం చూపించనున్నాయి.

ఒకటి, ఇండియన్ ఫెడరలిజం (సమాఖ్యవాదం) సమన్వయం పరచడం. అది మంచిదే. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఒత్తిడి పెంచినట్లు అవుతుంది. అప్పుడే జాగ్రత్తతో కూడిన మేనేజ్మెంట్ వ్యవస్థీకృతమవుతుంది. ఇటీవల 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి కేంద్రం అధికారంలో ఉన్న కొద్ది రాష్ట్రాల్లో ఈ మార్పు రావాల్సి ఉంది. బెంగాల్, తమిళనాడు, కేరళలో పాలిస్తున్న పార్టీలు రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాఖ్యవాద హక్కుల కోసం పోరాడుతున్నాయి.

కేంద్రానికి ఒక ఛాయీస్ మిగిలి ఉంది. రెండింతలు తగ్గి పనిచేయడమా లేదంటే ప్రస్తుతమున్న రాజకీయ లక్ష్యాలనే కొనసాగించడమా.. రాష్ట్రాలకు కూడా ఛాయీస్ ఉంది. అవి కేంద్రంతో మరింత ఘర్షణతో కూడి వ్యవహరించడమా లేదంటే కలుపుగోలుగా ఉంటూ అభివృద్ధి మాత్రమే కాంక్షించడమా. రెండిటిలోనూ ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే.

రెండోది.. బీజేపీ వెనక్కు వెళ్లిపోయిందనుకోవడంలో ఏ అనుమానం లేదు. రాజకీయ పార్టీపరంగా చూస్తే కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పార్టీ వైఫల్యం కనిపిస్తుంది. బీజేపీ బెంగాల్ లో అభివృద్ధిని కనబరచాల్సింది. అదేం లేకుండానే నేరుగా పోటీకి దిగింది. అలా ఏం జరగలేదు. తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గెలిచింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ్ మున్నేట్ర కఝగం(ఏఐఏడీఎంకే)తో పొత్తు కలుపుకున్నా వర్కౌట్ అవలేదు.

ఇంకొక విషయం ఏమిటంటే.. ప్రధాన మెట్రో సిటీలలో బీజేపీ అధికారం చేజిక్కించుకోలేకపోతుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా లాంటి చోట్ల దక్కించుకోలేకపోతే భవిష్యత్ లో ఎలక్టోరల్ గా పెద్ద ఎదురుదెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్, స్టేట్ ఎలక్షన్స్ ను విభిన్నంగా చూడటం వల్లే ఇలా జరుగుతోంది.

మూడోది, కాంగ్రెస్ కు ఉండాల్సిన ప్రతిపక్ష హోదా పూర్తిగా ప్రాంతీయ పార్టీలకు మారిపోయింది. అస్సాంలో కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది. బెంగాల్ లో దాదాపు క్షీణించినట్లే. పుదుచ్చేరిలోనూ ఏదో ఒకటి చేసి నిలబడగలిగింది. మరోవైపు ప్రాంతీయ బలాలు దృఢంగా ఉన్న టీఎంసీ, డీఎంకే, లెఫ్ట్ బాగానే పనిచేశాయి. 2024ఎన్నికల్లో తమ ప్రతిపక్షం ఎవరో సమీకరణాలు ఎలా ఉండాలో కాలిక్యులేషన్ కు వచ్చాయి.

నాలుగోది, ఈ ఎన్నికలను బట్టి మతపరంగా హద్దులు, అవకాశాలు ఏంటో తెలిసొచ్చింది. బెంగాల్ లో.. బీజేపీ బుజ్జిగింపులతో ప్రచారం చేసింది. టీఎంసీ ముస్లింలకు పక్షపాతంగా పనిచేస్తుంది హిందువులకు చేయకుండా అనే రకమైన కామెంట్లు చేసింది. కానీ, సిటిజన్ షిప్ (అమెండ్మెంట్) యాక్ట్ ప్రవేశపెట్టిందే బీజేపీ అనే సంగతి పక్కకుపెట్టేసింది. బెంగాల్ లో హిందూ ఓట్ల కోసమే అలా చేసినా ఉపయోగం లేదు.

టీఎంసీ తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పటికే హిందువుల్లో కొంత మేర బీజేపీకి సపోర్ట్ గా లేరనే విషయం అర్థమయ్యే ఉండాలి. కొన్ని చోట్ల మరికొందరు నాయకులు హిందూ వర్సెస్ ముస్లిం రేంజ్ లో ప్రచారం చేసినా ఉపయోగం లేదు. దానిని బట్టే వారు ఓ పాఠం నేర్చుకుని ఉండాలి. చివరికి బెంగాల్ లో మహిళా సాధికార స్కీంలు టీఎంసీకి, సంక్షేమ కార్యక్రమాలు అస్సాంలో బీజేపీకి, పబ్లిక్ హెల్త్, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకున్నందుకు లెఫ్ట్ పార్టీలకు బాగా హెల్ప్ అయింది. 2019లోనూ ప్రధాని నరేంద్ర మోడీ విజయానికి కారణమైంది ఇదే.