రాబోయే సంవత్సరం మీ ఫోన్ బిల్ 20% పెరగొచ్చు

రాబోయే సంవత్సరం మీ ఫోన్ బిల్ 20% పెరగొచ్చు

రాబోయే సంవత్సరం మీ ఫోన్ బిల్ 15 నుంచి 20శాతం పెరగొచ్చని ప్రముఖ టెలికాం సంస్థల నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ తమ టారిఫ్ రేట్లను పెంచుతుండటమే దీనికి కారణం. వొడాఫోన్ ఐడియా సంవత్సరం చివర్లో లేదా ఏడాది ఆరంభంలో 15నుంచి 20శాతం పెంచాలనుకుంటుంది.

అదే బాటలో వెళ్లనుంది భారతీ ఎయిర్‌టెల్ కూడా. నిజానికి ఇవి రెండూ రిలయన్స్ జియోను ఫాలో అవుతూ ఆ రేట్లకు తగ్గట్లుగానే నిర్ణయం తీసుకుంటున్నాయి. ‘కంపెనీ టారిఫ్ రేట్లను పెంచాలనుకుంటుంది. రెగ్యూలేటరి నిర్ణయించిన మేరకే ధరలు పెరుగుతాయి’ అని బిజినెస్ డైలీ పర్సన్ చెప్పారు.



అంతర్గతంగా ఈ టారిఫ్ ధరలను 25శాతం పెంచుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అటువంటి నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అని అంటున్నారు వినియోగదారులు. దేశంలోని మూడు ప్రైవేట్ టెల్కోస్ డిసెంబర్ 2019లోనే రేట్లు పెంచాయి.
https://10tv.in/reliance-industries-to-invest-up-to-371-crore-in-bill-gates-breakthrough-energy-ventures/
2016 రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రేట్లు పెరగడం ఫస్ట్ టైం. ఒక్కొక్క వొడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ.. రూ.119గా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ (రూ.162), జియో(రూ.145)గా ఉంది. వొడాఫోన్ ఐడియా ఎండీ రవీందర్ టక్కర్.. ప్రస్తుత టారిఫ్ ల గురించి మాట్లాడుతూ.. ధరలు రేట్లు పెంచడంలో ఎటువంటి మొహమాటం లేదు. మొదటి నుంచి అదే జరుగుతుందని అన్నారు.




‘టైంను బట్టి ధరలు పెంచుతూనే ఉంటాం. వీటిని ఎవరూ ఆపలేరు. టైమింగ్ మాత్రం కరెక్ట్ గానే ఉంది. ధరలు పెంచుతామనే నిర్ణయం కూడా ఎంతో దూరంలో లేదు’ అని టక్కర్ అన్నారు.

‘వొడాఫోన్ ఐడియా రేట్స్ పెంచడం ద్వారా ఫైనాన్షియల్ గా మెరుగై పొటెన్షియల్ ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతుందనుకుంటున్నాం’ అని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. డెబిట్ అండ్ ఈక్విటీతో కలిపి ఈ టెల్కో రూ.25వేల కోట్ల వరకూ పెరగనుంది.