Old 5 Rupees Note : ఈ పాత రూ.5 నోటు మీ దగ్గరుందా? రూ.30వేలు మీ సొంతం

Old 5 Rupees Note : ఈ పాత రూ.5 నోటు మీ దగ్గరుందా? రూ.30వేలు మీ సొంతం

Old 5 Rupees Note

Old 5 Rupees Note : ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా పెద్దలు. పాతబడే కొద్దీ కొన్నింటికి విలువ పెరుగుతుంది. పాత నాణెలు, కరెన్సీ నోట్లు ఈ కోవలోకే వస్తాయి. కొన్ని పాత కాయిన్లు, నోట్లకు ఆన్ లైన్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నాణెలు, నోట్లు… వేలు, లక్షలు పలుకుతున్నాయి. మీ దగ్గర పాత 5రూపాయల నోటు ఉందా? అయితే మీరు రూ.30వేలు గెలుచుకోవచ్చు. అయితే ఓ కండీషన్ ఉంది. ఆ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. అలాంటి పాత 5 రూపాయల నోటు మీ దగ్గరుంటే రూ.30వేలు మీ సొంతం అవుతాయి. వెబ్ పోర్టల్ కాయిన్ బజార్.కామ్(coinbazzar.com) ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ పోర్టల్ లో పాత నోట్లను వేలం వేస్తారు. వేలంలో వాటిని కస్టమర్లు కొనుగోలు చేస్తారు.

ఇక.. మీ దగ్గర పాత పది రూపాయల నాణెం దానిపై మాతా వైష్ణో దేవి బొమ్మ ఉందా? ఇలాంటి కాయిన్ మీ దగ్గరుంటే లక్షల రూపాయలు గెల్చుకోవచ్చు. 1977-1979కి చెందిన పాత రూపాయి నోటు ఉంటే.. దానికి రూ.45వేలు గెలుచుకోవచ్చు. అయితే ఆ నోటుపై ఫైనాన్స్ మినిస్ట్రీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరూబాయ్ పటేల్ సిగ్నేర్ ఉండాలి. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో హీరూబాయ్ పటేల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు.

మీ దగ్గరున్న పాత నాణెలు, నోట్లకు డబ్బు గెలుచుకోవాలంటే… ముందుగా కాయిన్ బజార్ డాట్ కామ్ వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరు, ఈ-మెయిల్, అడ్రస్ పొందుపరచాలి. ఆ తర్వాత మీ దగ్గరున్న కాయిన్ లేదా నోటు బొమ్మ తీసి అప్ లోడ్ చేయాలి. ఆక్షన్ లో ఉంచాలి. ఏ వ్యక్తి అయితే మ్యాగ్జిమమ్ బిడ్డింగ్ చేస్తాడో అతడికి ఆ కాయిన్ లేదా నోటు సొంతం అవుతుంది.

మరో వెబ్ పోర్టల్ ఇండియామార్ట్.కామ్(IndiaMART.com) సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తోంది. మీ దగ్గర పాత 25పైసల కాయిన్ ఉంటే.. రూ.1.5లక్షలు గెలుచుకోవచ్చు. అయితే ఆ కాయిన్ సిల్వర్ కలర్ లో ఉండాలి. మీ దగ్గరు అలాంటి కాయిన్ ఉంటే ముందుగా మీరు దాని ఫొటో తియ్యాలి. ఆ ఫొటోని ఇండియా మార్ట్ డాట్ కామ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత వేలం పాట నిర్వహిస్తారు.