వారి వయసు 265 ఏళ్లట : ఓటర్ల లిస్ట్ లో సిత్రాలు 

  • Published By: veegamteam ,Published On : March 14, 2019 / 08:17 AM IST
వారి వయసు 265 ఏళ్లట : ఓటర్ల లిస్ట్ లో సిత్రాలు 

లూథియానా : ఓటర్ల జాబితాల్లో తప్పుల తడకలు కొనసాగుతునే ఉన్నాయి.  లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరుగనున్న క్రమంలో ఎన్నికల సంఘం రూపొందించిన ఓటర్ల జాబితా విషయంలో ఇద్దరు ఓటర్ల వయసు విషయంలో ఘోరమైన తప్పులు దొర్లాయి. ఓ ఓటరు వయస్సు 255 ఏళ్లట…మరో వృద్ధుడి వయసు 144 ఏళ్లట…ఇదీ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లా ఎన్నికల అధికారులు లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ల జాబితాలోని సిత్రాలు. లూథియానా జిల్లాలో ఏకంగా 273 మంది అర్హులైన ఓటర్ల వయసు 118 ఏళ్లని ఓటర్ల జాబితాలో పేర్కొన్నారు. అమృతసర్ నగరంలో 558 మంది, హోషియార్ పూర్ లో 449 మంది ఓటర్ల వయసు వందేళ్లకు పైగా ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Read Also : టీడీపీలో సీటుపై ఫైటింగ్ : రాయపాటి రాజీనామా అంటూ ప్రచారం
 
పంజాబ్ రాష్ట్రంలో 5,916 మంది ఓటర్ల వయసు వందేళ్లకు పైగా ఉందని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్ కె రాజు స్వయంగా తెలిపారు. లూథియానా జిల్లాలో ఉన్న వంద సంవత్సరాలు దాటిన 57 మంది ఓటర్లను అధికారులతో పరిశీలన చేయించగా వారిలో 35 మంది మరణించినట్లుగా తేలింది. అక్షిత్ థావన్, గిల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన అశ్వనీకుమార్ ల వయసు ఓటర్ల జాబితాలో 265 ఏళ్లను అధికారులు పేర్కొన్నారు.శారదాదేవి అనే ఓటరు 1874వ సంవత్సరంలో జన్మించిందని ఓటర్ల జాబితాలో అధికారులు ఇచ్చారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లాయని తాము పరిశీలన చేయించి సరిదిద్దుతామని లూథియానా డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ అగర్వాల్ చెప్పారు. 
Read Also : హెలికాప్టర్ రెడీ : జగన్ సుడిగాలి ప్రచారం