G20 Summit: శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్.. ఉగ్ర ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత.. పాకిస్థాన్ ఏం చెప్పిందంటే..

శ్రీనగర్‌లో మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నేటి నుంచి మూడు రోజులు జరుగుతాయి. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), మార్కోస్ కమాండోలు, పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG)తో భద్రత ఏర్పాటు చేశారు.

G20 Summit: శ్రీనగర్‌లో జీ20 సమ్మిట్.. ఉగ్ర ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత.. పాకిస్థాన్ ఏం చెప్పిందంటే..

Kashmir G20 Summit

G20 Summit 2023: జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజులు ఈ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 60కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గోనున్నారు. దీంతో ఉగ్ర ఘటనలు జరగకుండా శ్రీనగర్ ప్రాంతంలో అడుగడుగునా భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం ఇది. దీంతో G20 సదస్సుకు వచ్చే ప్రతినిధులకి కాశ్మీర్‌లో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.

G20 Summit in Bali: జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటోలు

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), మార్కోస్ కమాండోలు, పోలీసు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG)తో భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాక డ్రోన్లతో భద్రతను పర్యవేక్షణ చేస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద బజర్వాన్ హిల్స్ నుంచి శ్రీనగర్ దాల్ లేక్ వరకు భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద నుంచి సమావేశం వేదిక వరకు రహదారి ప్రాంతాన్ని జీ20 లోగోలతో నింపేశారు. అంతేకాక ప్రతినిధులకు ఘనస్వాగతం పలికేందుకు భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.

AP CM Jagan: అప్పుడు వైఎస్ఆర్, చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. ఈసారి పనులు పూర్తికావడం పక్కా అంటున్న వైసీపీ శ్రేణులు

G20 వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఐదు కీలక ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారించనున్నారు. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, MSMEలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అంశాలపై చర్చలు జరగనున్నాయి. జీ20 సమావేశం ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రాంతం యొక్క స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో G20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలు పాల్గోనున్నారు.

Brijbhushan Sharan Singh: నేను నార్కో పరీక్షకు సిద్ధం.. రెజ్లర్లు సిద్ధమా? బ్రిజ్ భూషణ్ సంచలన ప్రకటన

కాశ్మీర్‌లో పర్యాటక, వ్యాపార రంగానికి ఊతమిచ్చేలా శ్రీనగర్ ప్రజలు జీ20 శిఖరాగ్ర సమావేశాలను స్వాగతిస్తున్నారు. అయితే, శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై బాధ్యతారహిత చర్య అని పొరుగు దేశం పాకిస్థాన్ విమర్శించింది. పాకిస్తాన్ విమర్శలను భారత్ తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా G20 సమావేశాలు నిర్వహించబడుతున్నాయని, అందువల్ల జమ్మూకాశ్మీర్, లడఖ్‌లలో సమావేశాలు నిర్వహించడం సహజమే అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.