Minister Nitin Gadkari : హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చిన మంత్రి నితిన్ గడ్కరి..ఇంధన ధరలు భారీగా పెరటమే కారణమా?!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పకనే చెప్పారా? హైడ్రోజన్ కారులో వచ్చి?!

Minister Nitin Gadkari : హైడ్రోజన్ కారులో పార్లమెంట్ కు వచ్చిన మంత్రి నితిన్ గడ్కరి..ఇంధన ధరలు భారీగా పెరటమే కారణమా?!

Nitin Gadkari Rolls Into Parliament In Hydrogen Car

Nitin Gadkari Rolls Into Parliament In Hydrogen Car : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari)మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆయన ఆలోచనా విధానంగా కూడా విభిన్నంగా ఉంటుంది. తాజాగా ఓ హైడ్రోజన్ కారును కొనుగోలు చేశారు. ఆ కారు ప్రత్యేకతలు గురించి పక్కన పెడితే..ఈరోజు (మార్చి 30,2022)కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ తో నడిచే కారులో పార్లమెంట్ కు వచ్చారు. దీంతో ఈ కారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పైగా ఈ మంత్రి గడ్కరి హైడ్రోజన్ కారు భారతదేశంలోనే మొట్టమొదటిది కావటం మరో విశేషం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు ఉదయం మంత్రి తన నివాసం నుంచి పార్లమెంటుకు కారులో వచ్చారు. మంత్రి గడ్కరీ తరచుగా పునరుత్పాదక..గ్రీన్ ఎనర్జీకి మార్పు గురించి మాట్లాడుతుంటారనే విషయం తెలిసిందే.

Also read : PAN-Aadhaar : ఇంకా మీ పాన్ – ఆధార్ లింక్ చేయలేదా? ఈ తేదీలోగా వెంటనే చేసేయండి..!

ఈ కారు ఫుల్ ట్యాంక్‌పై 600 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారుతో ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు కేవలం రూ. 2కి తగ్గుతుంది. దీంట్లో ఇంధన నింపటానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. గడ్కరి కారుకు తెలుపు, ఆకు పచ్చనంబర్ ప్లేట్ ఉంది.ఈ కారు పేరు ‘మిరాయ్’. అంటే దీని అర్థం భవిష్యత్తు అని. ఇంధనాల విషయంలో స్వయం స్వావలంభన సాధించే విధంగా ఈ మిరాయ్ ఉండనుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం రూ. 3000 కోట్లలో ఈ మిషన్ ప్రారంభించిందని…త్వరలోనే హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ బొగ్గును ఉపయోగిస్తున్నామో.. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించబడుతుందని గడ్కరీ అన్నారు. భారత్ ఆత్మనిర్భర్ కావడానికి… నీటి నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ ‘ మిరాయ్’ కారు పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రారంభిస్తామని.. పెట్రోల్ వంటి ఇంధన దిగుమతులను అరికడతామని మంత్రి గడ్కరి అన్నారు.

Also read : odisha : అసెంబ్లీలో రచ్చ..హెడ్‌ఫోన్స్‌ విరగొట్టి..స్పీక‌ర్‌ పై కుర్చీ ఎత్తిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

గత జనవరి నెలలో మంత్రి గడ్కరి మాట్లాడుతూ..నేను హైడ్రోజన్‌తో నడిచే కారును ఉపయోగిస్తానని ప్రకటించారు. జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ నాకు గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే వాహనాన్ని అందించింది అని తెలిపారు. దానిని నేనే పైలట్ ప్రాజెక్ట్‌గా (ప్రత్యామ్నాయ ఇంధనంపై) ఉపయోగిస్తాను” అని తెలిపారు గడ్కరి.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆలోచనా విధానం మిగతా వాళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. గత కొంతకాలంగా సంప్రదాయ ఇంధనాలు కాకుండా ప్రత్యామ్నయాలను ఉపయోగించాలని ఆయన పదే పదే చెబుతుంటారు. చాలా కాలంగా ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని కూడా ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్​లో పెట్రోల్ వినియోగం తక్కువగా ఉండాలంటే ఇప్పటినుంచే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించారు. దీంట్లో బాగంగానే మంత్రి గడ్కరీ పెట్రోల్, డీజిల్ , సీఎన్​జీతో కాకుండా హైడ్రోజన్​తో నడిచే కారును కొనుగోలు చేశారు. తాను కొన్న కారులో ఎలాంటి ఇంధనాన్ని ఉపయోగించరు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించుకోవాలన్నది ఆయన అభిమతం. ఫలితంగా వివిధ నగరాల్లో బస్సులు, ట్రక్కులుస కార్లను హైడ్రోజన్​తో నడపాలని యోచిస్తున్నారు.

Also read : Russia-Ukraine War : రష్యా నుంచి 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి చేసుకుంటున్న భారత్..ఇక ధరలు తగ్గనున్నాయా?

గత డిసెంబర్ లో ఫైనాన్షియల్ ఇన్​క్లూజన్ ఆరవ జాతీయ శిఖరాగ్ర సదస్సులో కేంద్రమంత్రి పాల్గొన్న సందర్బంగా ప్రసంగిస్తూ… సిటీల్లో మురుగునీరు, ఘన వ్యర్థాలను ఉపయోగించి బస్సులు, ట్రక్కులు, కార్లలో గ్రీన్​ హైడ్రోజన్ ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాలను నుంచి సంపదను సృష్టించుకోవాలని సూచించారు.