Mumbai : కారు బానెట్‌‌పై ట్రాఫిక్ పోలీసు, కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సింగ్ అంధేరిలో విధులు నిర్వహిస్తున్నారు. రాంగ్ సైడ్ నుంచి వచ్చిన ఓ కారు ఎస్వీ రోడ్డు వైపుకు వెళ్లింది. కారును ఆపాలని విజయ్ సింగ్ సిగ్నల్ ఇచ్చారు.

Mumbai : కారు బానెట్‌‌పై ట్రాఫిక్ పోలీసు, కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Trafic

Traffic Cop Sits On Car Bonnet : ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠినంగా ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే..వీరిని అడ్డుకోవడానికి కొంతమంది వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. వారితో వాగ్వాదానికి దిగడం, ఘర్షణలకు దిగుతుంటారు. కారు డ్రైవర్లలో కొంతమంది దారుణంగా ప్రవరిస్తుంటారు. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులపై ఏకంగా కారును పోనియడం, కారు బానెట్ పై కూర్చొన్నా..సరే..అలాగే ఈడ్చుకెళ్లిన ఘటనలు చూస్తుంటాం. తాజాగా..ఇలాగే ఘటన ఒకటి చోటు చేసుకుంది. ముంబైలో అంధేరిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారును అడ్డుకున్నారు అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు. అయితే..కారులో ఉన్న వ్యక్తి మాత్రం కిందకు దిగలేదు. దీంతో ఓ పోలీసు..కారు బానెట్ పై కూర్చొన్నాడు. అలాగే కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్.

Read More : Love Failure : రన్నింగ్ బస్సు దిగి.. హుస్సేన్ సాగర్ లో దూకిన యువకుడు

ఏమి జరిగింది ? 
2021, సెప్టెంబర్ 30వ తేదీ గురువారం ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సింగ్ అంధేరిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో..రాంగ్ సైడ్ నుంచి వచ్చిన ఓ కారు ఎస్వీ రోడ్డు వైపుకు వెళ్లింది. కారును ఆపాలని విజయ్ సింగ్ సిగ్నల్ ఇచ్చారు. కానీ..ఐడీ కార్డు చూపుతూ..తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కారు నడుపుతున్న వ్యక్తి. తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో..కారు బానెట్ పైకి ఎక్కి విజయ్ సింగ్ కూర్చొన్నారు. కారును పక్కకు ఆపాలని మరో కానిస్టేబుల్ సూచించారు.

Read More : Viral Pic : ఇడ్లీలు గుండ్రంగానే ఉండాలా ? ఐస్ క్రీమ్‌‌లా ఉండకూడదా ?

దీంతో ఓ లేన్ లోకి వెళ్లి..పక్కకు ఆపాడు డ్రైవర్. అమాంతం ఉన్నట్టుండి..కారును ముందుకు వేగంగా పోనిచ్చాడు. టర్నింగ్ చేయడంతో..కారు బానెట్ పై కూర్చొన్న విజయ్ సింగ్ కిందపడిపోయాడు. కారు ఆపకుండా..డ్రైవర్ ముందుకు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్ని..స్థానికులు ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కారు డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ విజయ్ సింగ్. ఇండియన్ పీనల్ కోడ్ లోని సంబంధింత సెక్షన్ల కింద..డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.