తమిళనాడు జల్లికట్టు ఆటలో విషాదం.. గోడ కూలి చిన్నారి సహా ఇద్దరు మృతి

తమిళనాడు జల్లికట్టు ఆటలో విషాదం.. గోడ కూలి చిన్నారి సహా ఇద్దరు మృతి

Tragedy in Tamil Nadu jallikattu game .. Two killed including a child : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఊరంతా ఆటను ఉత్సాహంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డాబా పైనుంచి ఆటను చూస్తున్న వారు గుంపుగా నిలబడటంతోనే గోడ కుప్పకూలినట్లు తెలుస్తోంది. పైన నిలబడిన కొందరు జారిపడటంతో పాటు.. పైనుంచి గోడ శకలాలు కూడా మీద పడటంతో గాయపడ్డవారి సంఖ్య పెరిగింది.

గాయపడ్డ వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెప్పపాటులో శకలాలు మీదపడటంతో కింద ఉన్నవారు తప్పించుకోలేపోయారని స్థానికులు సైతం తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.