ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది : ఈ నేతల్లో రైతు మిత్రులెవరు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 08:45 AM IST
ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది : ఈ నేతల్లో రైతు మిత్రులెవరు

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ లో ఉన్న మౌంట్ కార్మెల్ హైస్కూల్ టీచర్ ఓవరాక్షన్ చేశాడు. చేజేతులా తన ఉద్యోగం పొగొట్టుకున్నాడు. ఆ టీచర్ ఇచ్చిన ఓ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మౌంట్ కార్మెల్ స్కూల్ లో 8వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో విద్యార్థులను అడిగిన ఓ ప్రశ్న… రైతులకు మిత్రులు ఎవరు? అంతవరకూ బాగానే ఉంది. ఆ ప్రశ్నకు జవాబుగా ఇచ్చిన ఆప్షన్స్ చూసి  అంతా షాక్ అయ్యారు. ఆప్షన్స్ గా A. కుమారస్వామి, B. వానపాములు, C. యడ్యూరప్ప అని ఇచ్చారు. విద్యార్థులు సరిగ్గానే ‘వానపాములు’ అన్న ఆప్షన్ ను ఎంచుకున్నారు. కాగా, ఈ వ్యవహారం దుమారం రేపింది.

ఈ క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాంటి ఆప్షన్స్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. స్కూల్ లో రాజకీయాలు ఏంటి? అని మండిపడుతున్నారు. దీంతో స్కూల్ యాజమాన్యం వివరణ  ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్ ను ఉద్యోగం నుంచి తీసేశామని ప్రకటించింది. తాము ఏ రాజకీయ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. మొత్తంగా కొత్తదనం కోసం ట్రై చేసిన టీచర్..  చివరికి తన ఉద్యోగం పొగొట్టుకున్నాడు.

అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఇలాంటి ఘటనే జరిగింది. బీఏ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయండి అని విద్యార్థులకు 4 మార్కుల ప్రశ్న ఇవ్వడం విమర్శలకు దారితీసింది.