బెంగాల్ లో కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

బెంగాల్ లో కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి

Trinamool Goons Attacked My Convoy Alleges Union Minister Posts Video

Union Minister ప‌శ్చిమ బెంగాల్‌లో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌పై దాడి జరిగింది.. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పంచకుడిలో ముర‌ళీధ‌ర‌న్ కాన్వాయ్‌ పై స్థానికులు రాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డంతో.. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దాడిలో మంత్రి కారు ధ్వంసమైంది.

ఈ నేప‌థ్యంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర మంత్రి రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. టీఎంసీ గూడాలు నా కాన్వాయ్​పై దాడి చేశారు.. అద్దాలను పగులగొట్టారు.. వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు..నా పర్యటనను కుదించుకుంటున్నా అంటూ మంత్రి ట్వీట్ చేశారు. తన కాన్వాయ్ పై దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక, ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ ను నివేదిక కోరారు.

మరోవైపు, ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల ఫలితాలు వెలువడిన అనంత‌రం చోటుచేసుకున్న హింసాకాండ‌పై వాస్త‌వాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిజ నిర్ధార‌ణ బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. హోం మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి సారథ్యంలో ఈ ప్ర‌తినిధి బృందం బెంగాల్ లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ బృందం అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం వివిధ ప్రాంతాల్లో జ‌రిగిన హింసాకాండ‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను అథ్య‌య‌నం చేయ‌డంతో పాటు క్షేత్ర‌స్ధాయి ప‌రిస్థితిని మ‌దింపు చేయ‌నుంది.

మ‌రోవైపు ఎన్నిక‌ల అనంత‌ర హింస‌పై త‌క్ష‌ణ‌మే స‌మ‌గ్ర నివేదిక‌ను పంపాల‌ని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. స‌త్వ‌ర‌మే నివేదిక‌ను పంప‌ని ప‌క్షంలో ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. కాగా బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విజ‌యం సాధించిన అనంత‌రం చెల‌రేగిన అల్ల‌ర్ల‌లో 14మంది మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఇక టీఎంసీ గూండాలు త‌మ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది.