Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం.. నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు..

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం, చంపుకోవడం గురించి విన్నాము, చూశాము. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది...

Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం.. నడిరోడ్డుపై ఇద్దరమ్మాయిలు..

Girls Fight

Girls Fight : అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం, చంపుకోవడం గురించి విన్నాము, చూశాము. ఆ అమ్మాయి నాకే సొంతం అంటే కాదు నాకే సొంతం అంటూ అబ్బాయిలు ఘర్షణ పడటం చూశాము. ఇది కామన్. కానీ, ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడం, అదీ నడిరోడ్డుపై ఘర్షణకు దిగడం.. కాస్త అరుదుగా జరిగే ఘటనగానే చెప్పుకోవాలి. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువుతులు కొట్టుకున్న ఘటన ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది.

బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై గొడవకు దిగారు. తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో తిరగడం చూసిన యువతి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయింది. ఆగ్రహంతో ఊగిపోయింది. మార్కెట్ లో అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి జట్టు పట్టుకుంది. పిడిగుద్దులు కురిపించింది. ఆ అమ్మాయి కూడా అస్సలు తగ్గలేదు. నన్నే కొడతావా అంటూ ఎదురుదాడికి దిగింది. ఇలా ఇద్దరూ కింద పడి మరీ తెగ కొట్టుకున్నారు. పిడిగుద్దులు కూడా కురిపించుకున్నారు. అమ్మాయిలు అలా రోడ్డుమీద పడి మరీ కొట్టుకోవడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. వీళ్లసలు అమ్మాయిలేనా? అనే అనుమానం కలిగింది.

చివరికి పోలీసులు స్పాట్ కి వచ్చే లోపు ఇద్దరు యువతులు, యువకుడు అక్కడి నుంచి పారిపోయారు. ఝార్ఖండ్ లోని సరాయకేలాలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు బాబోయ్ అని విస్తుపోతున్నారు.