Minister Amit Shah: కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తే రక్తపాతమే అన్నారు.. వారికి ఈ నినాదాలే సమాధానం ..

కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తే రక్తపాతం జరుగుతుందని భయపెట్టిన వారికి.. ఇక్కడి ప్రజలు మోదీ.. మోదీ అంటూ నినదించే నినాదాలే సమాధానం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి కేంద్ర మంత్రి హాజరయ్యారు.

Minister Amit Shah: కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తే రక్తపాతమే అన్నారు.. వారికి ఈ నినాదాలే సమాధానం ..

Minister Amit shah

Minister Amit Shah: జమ్ముకశ్మీర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు అమిత్ షా పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి కేంద్ర మంత్రి హాజరయ్యారు. అమిత్ షా ప్రసంగించే సమయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు మోదీ.. మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేస్తే రక్తపాతం జరుగుతుందని భయపెట్టిన వారికి ఈ నినాదాలే సమాధానం అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు.

Russia-Ukraine War: పుతిన్‌కు షాకిస్తున్న రష్యా యువత.. ఆ దేశం నుంచి 27శాతం పెరిగిన వన్ వే ఎయిర్‌లైన్ టికెట్లు

కశ్మీర్ ను 70ఏళ్లు పాటు మూడు కుటుంబాలే పాలించాయని, ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని అమిత్ షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని, హైవేల కోసం రూ. లక్ష కోట్లు మంజూరు చేశామని అన్నారు. అంతేకాక.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కశ్మీర్ లో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని, 100కుపైగా పాఠశాలలు కొత్తగా వచ్చాయన్న అమిత్ షా.. ఇవన్నీ, 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరిగాయని అన్నారు. గతంలో అభివృద్ధి కోసం కేంద్రం పంపిన డబ్బులన్నీ కొందరే దోచుకునేవారని, ఇప్పుడు అంతా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదులపై తీసుకున్న పటిష్టమైన చర్య కారణంగా ఇప్పుడు భద్రతా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

గుజ్జర్లు, బకర్వాల్‌లతో పాటు పహారీ సామాజిక వర్గానికి కూడా త్వరలో విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)గా రిజర్వేషన్లు కల్పిస్తామని అమిత్ షా అన్నారు. పహారీలకు ఎస్టీ హోదాను మంజూరు చేస్తే, భారతదేశంలో ఒక భాషా వర్గానికి రిజర్వేషన్లు లభించిన మొదటి ఉదాహరణ అవుతుందని, ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలి. కమీషన్ (లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన) నివేదికను పంపింది. గుజ్జర్, బకర్వాల్, పహారీ వర్గాలకు రిజర్వేషన్లను సిఫార్సు చేసింది. ఇది త్వరలో ఇవ్వబడుతుందని అమిత్ షా అన్నారు.. ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాతే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అమిత్ షా పేర్కొన్నారు.