ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరా : కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2020 / 07:15 AM IST
ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరా : కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీనిపై పార్లమెంట్ లో సోమ లేదా మంగళవారాల్లో ప్రకటన చేసే చైనాలో ఉన్న భారతీయులను స్వదేశం తీసుకొస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్నట్లు తెలిపారు. కేరళలో కరోనా కేసు నిర్ధారణ కాలేదన్నారు.

చైనాతోపాటు ఆ వ్యాధి సోకిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో ఎయిర్ పోర్టుల్లో పూర్తి పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. చైనాలో వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాల్లో నివాసముంటున్న భారతీయులతో మాట్లాడి ఒప్పించి భారత ప్రభుత్వం.. ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాధి నుంచి పరిరక్షించే ట్రీట్ మెంట్ ఇచ్చే వైద్యులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

భారత రాయబార్లతో సంప్రదింపులు చేస్తుందన్నారు. భారతీయులకు ఎలాంటి ఇబ్బంది కల్గకండా ఆయా రాయబార కార్యాల్లో పూర్తిస్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అక్కడున్న భారతీయులకు ఏ రకమైన కష్టమొచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారు భారత్ కు రావడానికి ఇష్టపడితే అవసరమైతే తిరిగి తీసుకురావడానికి కేంద్రం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.