‘రెండో ఎక్కం చెప్పలేవు..నిన్ను పెళ్లి చేసుకోవాలా?’..పెళ్లి పీటల నుంచి లేచి వెళ్లిపోయిన వధువు..!

‘రెండో ఎక్కం చెప్పలేవు..నిన్ను పెళ్లి చేసుకోవాలా?’..పెళ్లి పీటల నుంచి లేచి వెళ్లిపోయిన వధువు..!

2nd Table Where Marriage Is Stopped

second table that stopped the wedding : ఎవరన్నా కట్నం ఎక్కువ అడుగుతున్నాడనో..లేదా అవమానించాడనో..లేక మరేదైనా గట్టి కారణముంటే పెళ్లి పీటల దాకా వచ్చి మరికాసేపట్లో పెళ్లి జరగనున్న క్రమంలో పెళ్లిళ్లు ఆగిపోవటం గురించి విన్నాం. కానీ ఓ వధువు మాత్రం వరుడు ‘‘రెండవ ఎక్కం (2nd table) చెప్పలేదనీ ‘‘నాకీ ఈ పెళ్లి కొడుకు వద్దు..కనీసం రెండో ఎక్కం కూడా చెప్పటం రాదు..నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా?’’ అంటూ వధువు పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అప్పటి వరకూ సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ‘‘పెళ్లి కొడుక్కి రెండో ఎక్కం కూడా రాదంట’’అనే మాట పాకిపోయింది. దీంతో గందరగోళం..నెలకొంది. అసలు పెళ్లిలో ఈ రెండో ఎక్కం ప్రస్తావన ఎందుకొచ్చింది? జస్ట్ ఎక్కం చెప్పలేదని వధువు ఎందుకు వెళ్లిపోయింది? ఆ పెళ్లి జరిగిందా… ఆగిపోయిందా? చివరకు ఏమైందో ఈ వింత ఘటన గురించి తెలుసుకోవాల్సిందే కదూ..

అది ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్..మహోబాజిల్లా..పన్వారీ ఏరియాలోని ధావార్ గ్రామంలోని ఓ పెళ్లి మండపం. అక్కడంతా పెళ్లి సందడి జోరు జోరుగా సాగుతోంది. సరదాలు, ఛలోక్తులతో సందడి సందడిగా ఉ:ది. వధూ వరులను ఊరేగించేందుకు అలంకరించిన గుర్రం కూడా రెడీగా ఉంది. అలా వధువు పెళ్లి మండపానికి వచ్చింది. రెండువైపులా బంధు, మిత్రులు ఉన్నారు. అలా వచ్చిన పెళ్లి కూతురు వచ్చి… వరుడి పక్కన పెళ్లి పీటలమీద కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే… వరుడు… ఈ మంత్రాలు, లెక్కలూ ఏంటీ..అన్నట్లుగా చిరాగ్గా ముఖం పెట్టాడు. నేను ఇవేవీ చెప్పనని చెప్పాడు. దీంతో వధువుకు డౌటు వచ్చింది. ఎందుకలా ఉన్నావని అడిగింది. అవన్నీ చెప్పటానికి నాకు చికాకు అన్నాడు. చిన్న చిన్న మాటలివి..పెళ్లిలో ఇవన్నీ సంప్రదాయలు అలా ఎలా అంటారని ప్రశ్నించింది..దానికి వరుడు చిరాకుపడ్డాడు.

దీంతో వధువు “అసలు మీరు ఏం చదువుకున్నారు…జస్ట్ రెండో ఎక్కం చెప్పండి”…అని అడిగింది. దానికి వరుడు ఆమె వైపుచూసి… “ఏయ్ సిల్లీగా రెండో ఎక్కం చెప్పడమేంటి…” వాటే జోక్..అంటూ నవ్వేసి ఊరుకున్నాడు. దాంతో ఆమెకు మండింది. “మీరు రెండో ఎక్కం చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది” లేదంటే లేదు అంతే అని చెప్పేసరికి వరుడికి దిమ్మ తిరిగిపోయింది? ఏంటీ..అహా నాకేంటిది? అంటూ వెంకటేశ్ స్టైల్లో అన్నాడు. దానికి వధువు ఏమాత్రం తగ్గలేదు. ‘‘రెండో ఎక్కం చెప్పాల్సిందే’’అని పట్టుపట్టింది.

దీంతో పాపం వరుడికి గొంతులో పచ్చి వెలక్కాయలు పడినట్లు ఫీలైయ్యాడు. కానీ పౌరుషానికి మాత్రం ‘‘హా ఏంటీ రెండో ఎక్కమేగా…. చెప్పేస్తా అదో పెద్ద విషయమా ఏంటీ? అన్నాడు. అయితే చెప్పండీ అంది ఏమాత్రం ఊరుకోని వధువు. దానికి పాపం వరుడి తిప్పలు చూడాలి..‘ ఆ..ఏంటీ ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఇప్పుడు సడెన్ గా అడిగితే ఏం గుర్తుంటుంది అయినా నాకేం భయం..చెప్పేస్తా వినూ..అంటూ ఒక్క రెండు రెండు..రెండు రెళ్లు నాలుగు..మూడు రెళ్లు..మూడు రెళ్లు హా..గుర్తొచ్చింది. ఆరు..ఆ..ఆ కాదు కాదు ఎనిమిది…” అంటూ మొదలెట్టాడు. దానికి వదువుకి ఆఫ్ట్రాల్ రెండో ఎక్కం చెప్పలేకపోతున్నాడు..అనుకుంటూ హా చెప్పండీ..చెప్పండీ అంటూ రెట్టించింది. కానీ ఆ తరువాత వరుడు నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. గుడ్లు మిటకరించి చూస్తుండిపోయాడు. దాంతో వధువుకు ఒళ్లు మండిపోయింది. అక్కడి నుంచి లేచి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అంతే… మండపంలో అందరూ షాక్…విషయం ఏంటీ అంటే అందరికి తెలిసిపోయింది. ‘వరుడికి రెండో ఎక్కం కూడా రాదంట’’అంటూ చెప్పుకోవటం మొదలెట్టారు.

ఆమె మండపం నుంచి కిందకు దిగగానే… రెండువైపులా కుటుంబ సభ్యులు ‘‘ఏమైందమ్మా’’ అని అడిగారు. దానికి ఆమె “మీరే చెప్పండి… రెండో ఎక్కం చెప్పలేకపోతున్నాడు పెళ్లికొడుకు..అటువంటివాడిని నేను పెళ్లి చేసుకోవాలా… నాకు ఇష్టం లేదు..చదువుకున్నవాడని చెప్పి నన్నను మోసం చేశారు” అంటూ వెళ్లిపోయింది. దీంతో అందరూ తెల్లమొఖాలు వేశారు. కానీ..పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోవటం రెండువైపులా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అమ్మాయని ఒప్పించటానికి ఆమె స్నేహితుల్ని పంపించారు. కానీ..ఆమె ఎంతకీ ఒప్పుకోలేదు. ఎవ్వరి మాటా ఆమె వినలేదు. పెళ్లి ఆగిపోయిన విషయం అలా అలా పోలీసులకు తెలియటంతో అక్కడికి వచ్చారు. వారు కూడా… పీటల మీద పెళ్లి ఆగిపోవడం కరెక్టు కాదమ్మా..అంటూ వధువుని ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా ఆమె ఒప్పుకోలేదు.

దీనికి గురించి వధువు బంధువొకరు మాట్లాడుతూ..వరుడు నిరక్షరాశ్యుడు. కానీ ఆ విషయం మాకు పెళ్లి కుదుర్చుకునే సమయంలో చెప్పలేదు. రెండో ఎక్కం చెప్పకపోవడంతో… అతను ఏమీ చదువుకోలేదని..ఆ విషయాన్ని మగపెళ్లివాళ్లు దాచి పెట్టారు. అతను అసలు స్కూలుకే వెళ్లలేదట. పెళ్లికూతురికి కోపం ఎక్కడొచ్చిందంటే… ఈ విషయాన్ని దాచి మోసం చెయ్యాలని ప్రయత్నించారు..అందుకే వద్దంటోంది అని తెలిపారు.

రెండువైపుల వాళ్లూ… ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయోననే ఆందోళనతో ఎందుకొచ్చిన సమస్య అనుకుని..వధువు ఇష్టప్రకారమే… పెళ్లి ఆపేసుకున్నారు. రెండువైపులా ఇచ్చుకున్న కట్నాలు, నగలు, గిఫ్టులను మళ్లీ వెనక్కి ఇచ్చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊరి పెద్దలు కూడా జోక్యం చేసుకొని… మేటర్ మొత్తం సెటిల్ చేశారు. మొత్తానికి అలా..రెండో ఎక్కం వారి పెళ్లిని ఆపేసింది..