Dr. jk misra died : 50 ఏళ్ళు పని చేసిన ఆస్పత్రిలో వెంటిలేటర్ లేక కరోనాతో మరణించిన డాక్టర్

85 ఏళ్ల సీనియర్ డాక్టర్ జెకె మిశ్రా..ప్రయాగ్రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిలో దాదాపు 50ఏళ్లు పనిచేశారు. కోవిడ్-సంబంధిత సమస్యలతో ఆయనకు వెంటిలేటర్ అవసరమైనా ఆయన పనిచేసిన ఆస్పత్రిలోనే వెంటిలేటర్ మాత్రం దొరకలేదు. ఐదు దశాబ్దాలుగా పనిచేసిన అదే ఆసుపత్రిలో భార్య కళ్లముందే ఆయన వెంటిలేటర్ అందక ప్రాణాలు విడిచిన అత్యంత దయనీయంగా మరణించారు డాక్టర్ జెకె మిశ్రా.

Dr. jk misra died : 50 ఏళ్ళు పని చేసిన ఆస్పత్రిలో వెంటిలేటర్ లేక కరోనాతో మరణించిన డాక్టర్

Doctor Jk Misra Died Due To Covid 19

doctor jk misra died due to covid-19 : కరోనా వారియర్స్ గా పనిచేసే డాక్టర్లే మహమ్మారిన బారిన పడి చనిపోతే అంతకంటే విషాదం మరొకటి ఉంటుందా? కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈరోజుల్లో వెంటిలేటర్ సౌకర్యం లేక ఆస్పత్రుల్లో చెట్ల కింద కూడా అనాథల్లా పడి ప్రాణాలు కోల్పోతున్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ 50 సంవత్సరాల పాటు వైద్య సేవలు చేసిన ఓ డాక్టర్ కరోనా బారిన పడి వెంటిలేటర్ సౌకర్యం కూడా పొందలేని దారుణమైన దుస్థితిలో కరోనా కాటుకు బలైపోయాడు ఓ సీనియర్ డాక్టర్ జెకె మిశ్రా ప్రయాగ్రాజ్. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ అత్యంత దారుణ పరిస్థితి కరోనా తీవ్రతకు అద్ధం పడుతోంది. తాను 50ఏళ్లు వైద్య సేవలు అందించిన ఆస్పత్రిలో యకూడా 85 ఏళ్ల సీనియర్ డాక్టర్ జెకె మిశ్రాకు ఇటువంటి దుస్థితి ఎదురు కావటం గమనించాల్సిన విషయం.

85 ఏళ్ల సీనియర్ డాక్టర్ జెకె మిశ్రా..ప్రయాగ్రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిలో దాదాపు 50ఏళ్లు పనిచేశారు. కోవిడ్-సంబంధిత సమస్యలతో ఆయనకు వెంటిలేటర్ అవసరమైనా వెంటిలేటర్ మాత్రం దొరకలేదు. ఐదు దశాబ్దాలుగా పనిచేసిన అదే ఆసుపత్రిలో భార్య కళ్లముందే ఆయన వెంటిలేటర్ అందక ప్రాణాలు విడిచిన అత్యంత దయనీయంగా మరణించారు డాక్టర్ జెకె మిశ్రా. మిశ్రా ఏప్రిల్ 13 న కరోనా బారిన పడ్డారు. మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయిన మూడు రోజులకు ఆరోగ్యం విషమంగా మారింది.

ఆ తర్వాత ఆయనను వెంటిలేటర్ పై ఉంచాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రి అధికారి సూర్యభన్ కుష్వాహా మాట్లాడుతూ..ఆసుపత్రిలో సుమారు 100 వెంటిలేటర్లు ఉన్నాయి. కాని అప్పటికే వేరే రోగులకు వాటిని కేటాయించారని..డాక్టర్ మిశ్రా కోసం ఒకరికి ఏర్పాటు చేసిన వెంటిలేటర్ ను తొలగించడం సరైంది కాదని తెలిపారు.

భారతదేశంలో COVID-19 మహమ్మారి తీవ్రతలో ఉత్తర ప్రదేశ్ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.97 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. పెరుగుతున్న కేసులు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలను లేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బాధితులు..వారి బంధువులు ఆసుపత్రి బెడ్ లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్స్ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి తీవ్రత ఆ రేంజ్ లో ఉంది.